న్యూస్ రౌండప్ టాప్ 20

1.పూణే నుంచి తెలంగాణ కు వాక్సిన్ లు

నిన్న రాత్రి పుణె నుంచి తెలంగాణకు నాలుగు లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి.

2.ఈటెల భూ కబ్జాలపై రెండో రోజు విచారణ

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జా రఘువరన్ శామీర్ పేట మండలం దేవరయాంజల్ భూముల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు.

3.ఈటెల కు ఎన్ ఆర్ ఐ ల మద్దతు

తెలంగాణ వచ్చింది కుటుంబ పాలన కోసమా అనే అంశంపై మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మద్దతుగా తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో ధూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారంతా తెలియజేశారు.

4.నెహ్రూ జూ పార్క్ లో 8 సింహాలకు కరోనా

హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో 8 సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు జూ అధికారులు తెలిపారు.

5.మే నెలలో జరిగే పరీక్షలన్నీ వాయిదా

కరోనా నేపథ్యంలో మే నెలలో జరగాల్సిన ఆఫ్ లైన్ పరీక్షలను వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

6.  తెలంగాణ లో కరోనా

తెలంగాణ లో కొత్తగా 6,876 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

7.నేడు హుజురాబాద్ కార్యకర్తలతో ఈటెల భేటీ

నేడు హుజురాబాద్ లో కార్యకర్తలతో మరోసారి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ కానున్నారు.ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు.

8.కరోనా లక్షణాలు ఉంటే ఈ నంబర్ కి ఫోన్ చేయండి

కరోనా సోకినట్టు అనుమానం వస్తే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్ (040 - 21111111 ) కు చేయాలని తెలంగాణ వైద్య శాఖ అధికారులు ప్రకటించారు.

9.జగన్ కు సోమిరెడ్డి లేఖ

కోవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ సీఎం జగన్ కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేఖ రాశారు.

10.కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతా శాశ్వత సస్పెన్షన్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసినట్లు ట్విట్టర్ ప్రకటించింది.

11.పూర్తి లాక్ డౌన్ మాత్రమే పరిష్కారం

Advertisement

కొవిడ్ మరణాల రేటు పెరగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తప్పుపట్టారు.భారత్ లో కరోనా అదుపులోకి రావాలంటే లాక్ డౌన్ ఒక్కటే ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు.

12.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,229 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.యూకేలో భారత్ భారీ పెట్టుబడులు

 భారత్ కు చెందిన అంతర్జాతీయ స్థాయి వాక్సిన్ తయారీ దిగ్గజం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యూకే లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అయ్యింది.

14.సీఐడీ విచారణకు మరోసారి దేవినేని ఉమ

వీడియో మార్ఫింగ్ చేశారన్న అభియోగం పై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సిఐడి విచారణకు మూడోసారి హాజరయ్యారు.

15.ఐపీఎల్ నిరవదిక వాయిదా

పలు జట్ల ఆటగాళ్లకు కరుణ వైరస్ తో బి సి సి కీలక నిర్ణయం తీసుకుంది ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

16.గజిని సీక్వెల్ లో అల్లు అర్జున్

ప్రముఖ దర్శకుడు మురుగుదాదాస్  గజిని 2 సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారు.ఇందులో అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోబోతున్నట్లు సమాచారం.

17.మెక్సికో లో ఘోర రైలు ప్రమాదం

మెక్సికో లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది.రాజధాని మెక్సికో సిటీ లో మెట్రో రైలు కింద పడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

18. వకీల్ సాబ్ పై ఫిర్యాదు

తన అనుమతి లేకుండా వకీల్ సాబ్ చిత్రం లోని ఓ సన్నివేశంలో తన ఫోన్ నంబర్ ను ఉపయోగించారు అంటూ సుధాకర్ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కథానాయిక అంజలి కి చెందిన ఫోటోలు అసభ్యకరంగా మార్చినట్లు సినిమాలో ఓ సన్నివేశం ఉందని,  అందులో అంజలి ఫోటో కింద తన ఫోన్ నంబరు ఉండటం కారణంగా అనేకమంది ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు అంటూ వెంటనే చిత్ర యూనిట్ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు.

19.భారత్ నుంచి వచ్చే వారి పై అమెరికా ఆంక్షలు

భారత్ లో కరోనా కేసులు పెరిగిపోతుండడంతో ముందు జాగ్రత్త చర్యగా అమెరికా ప్రభుత్వం విధించిన ట్రావెల్ ల్ బ్యాన్ నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

ఏప్రిల్ 4 నుంచి భారత్ నుంచి అమెరికా కు రావడాన్ని నిషేధించారు.కొంతమందికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు.

20.ఈ రోజు బంగారం ధరలు

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44,570 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,570.

Advertisement

తాజా వార్తలు