తెలంగాణ రాబిన్ హుడ్ పండగ సాయన్న బయోపిక్ నే హరిహర వీరమల్లు అంట

క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఇక ఇప్పటికే 40 శాతం సినిమా షూటింగ్ పూర్తయింది.సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఇప్పటి వరకు కీలక సన్నివేశాలని షూట్ చేశారు.

ఇక ఈ కథ 500 ఏళ్ల క్రితం మొఘలాయిల కాలం నాటిదని మొదటి నుంచి వినిపిస్తున్న మాట.పీరియాడిక్ జోనర్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిమీద అంచనాలు భారీగానే ఉన్నాయి.ఇక ఈ సినిమా కథాంశం అంతా అప్పటి కాలంలోనే ఉంటుందని, అలాగే వీరమల్లు అనే ఓ బందిపోటు దొంగ కథగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఇది రియల్ స్టొరీ బేస్ చేసుకొని తెరకెక్కుతున్న కథ అనే మాట బలంగా వినిపిస్తుంది.తెలంగాణ రాబిన్ హుడ్ గా ప్రసిద్ధి చెందిన పండుగ సాయన్న జీవిత కథ అనే టాక్ బలంగా వినిపిస్తుంది.

మహబూబ్ నగర్-పాలమూరుకి చెందిన పండుగ సాయన్న తెలంగాణ రాబిన్ హుడ్ గా ఫేమస్.భూ స్వాముల ఇళ్ళపై దాడులు చేసి వారి సంపద దోచుకొని పేదలకి పంచి పెట్టిన వ్యక్తి.

అతనిని ఆ కాలంలో బందిపోటుగా చిత్రీకరించిన, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారి కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి.అతని కథనే క్రిష్ హరిహర వీరమల్లు సినిమాలో ఆవిష్కరిస్తున్నారని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ ఆ పాత్రకి పెర్ఫెక్ట్ గా సరిపోతాడని, కచ్చితంగా సినిమా వకీల్ సాబ్ ని మించి హిట్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

తాజా వార్తలు