థియేటర్స్, ఒటీటీలో ఒకేసారి రాబోతున్న సల్మాన్ ఖాన్

ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం ఊహించని సరికొత్త మార్పులని తీసుకొచ్చిందని చెప్పాలి.గత ఏడాది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ విధంగా భయపెట్టిందో అందరికి తెలిసిందే.

అయితే కరోనా నుంచి కొంత విరామం దొరికి మరల ప్రజలు వారి రోజువారి జీవితాలని యధావిధిగా కొనసాగిస్తూ ఉండగా మరోసారి కరోనా సెకండ్ వేవ్ దేశంలో ప్రజలందరిని భయపెడుతుంది.దేశంలో ప్రతి రోజు లక్షలాది కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దీంతో మరోసారి దేశ ప్రజలందరూ ఎవరికీ ఎవరూ సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు.ఈ నేపధ్యంలో థియేటర్స్ కి ప్రేక్షకులు పెద్దగా వెళ్ళడం లేదనే చెప్పాలి.

పెద్ద స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే మొదటి వారం మాత్రమే సినిమా చూస్తున్నారు.సెకండ్ వీక్ నుంచి పూర్తిగా ప్రేక్షకుల సందడి తగ్గిపోతుంది.

Advertisement

తాజాగా పవర్ పవన్ కళ్యాణ్ సినిమాకి కూడా అదే పరిస్థితి నెలకొంది.సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కొంత వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇక ఇప్పటికే మినిమమ్ రేంజ్ సినిమాలు అన్ని కూడా సినిమాలని వాయిదా వేసుకుంటున్నారు.అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు మిగిలిన నిర్మాతలు అందరికి సరికొత్త మార్గం చూపించారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తాను నటించిన కొత్త సినిమా రాదేని ఒకేసారి థియేటర్స్ తో పాటు, ఒటీటీలో కూడా రిలీజ్ చేయబోతున్నాడు.మే 13న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

అయితే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూసే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అదే సమయంలో ఒటీటీలో కూడా రిలీజ్ చేయడం ద్వారా ఇంటి వద్దనే సినిమా చూసే వెసులుబాటు దొరుకుతుంది.అయితే ఒటీటీలో అన్ని సినిమాల మాదిరిగా రాదే మూవీ చూడటానికి కుదరదు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

కేవలం ఒటీటీలో పే ఫర్ వ్యూ విధానం ద్వారా ఈ సినిమాని వీక్షించే అవకాశం కల్పిస్తారు.దీని ద్వారా సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ కి ఎలాంటి డోకా ఉండదు.

Advertisement

ఇది వర్క్ అవుట్ అయితే మిగిలిన హీరోలు కూడా ఇదే పంథాలో సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది.

తాజా వార్తలు