నితిన్ సింగర్ సునీత ఫ్యామిలీకు అంత క్లోజా..?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన రంగ్ దే సినిమా ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా నుండి నితిన్ మంచి విజయాన్ని అందుకోగా.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా సక్సెస్ తర్వాత మరో ప్రాజెక్టుకు సిద్ధమయ్యాడు.

ఇదిలా ఉంటే తాజాగా నితిన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగగా.అందులో సింగర్ సునీత ఫ్యామిలీ హాజరయ్యారు.

నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా మాస్ట్రో అనే టైటిల్ ను, ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఇక నితిన్ 38వ పుట్టినరోజు వేడుకలు అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది.

Advertisement

ఈ వేడుకకు గాయని సునీత, ఆమె భర్త రామ్ కూడా పాల్గొన్నారు.ఈ వేడుకలకు సునీత తన భర్తతో రావడానికి కారణం.

రామ్ ఓ యూట్యూబ్ మీడియా సంస్థను నడిపిస్తున్నాడు.దీంతో నితిన్ కు చాలా క్లోజ్ అవ్వగా.

రామ్, సునీత ల పెళ్లి జరగడానికి నితిన్ పాత్ర ఉందని తేలింది.వీరి ఎంగేజ్మెంట్ వేడుకలను కూడా నితిన్ చేతుల మీదగా జరిపించగా.

నితిన్ కు సునీత కుటుంబంతో మంచి సంబంధం ఉందని తెలుస్తుంది.ఇక నితిన్ కు తన పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టిన రోజు కాగా అతని భార్యతో కలిసి, సునీత ఫ్యామిలీ తో ఫోటో దిగాడు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రంగ్ దే సక్సెస్ తర్వాత ఈ సినిమా సంతోషాన్ని, పుట్టినరోజు సంతోషాన్ని బాగా ఎంజాయ్ చేశాడు నితిన్.

Advertisement

ఇక త్వరలోనే తన కొత్త సినిమా మాస్ట్రో గురించి కొన్ని విషయాలు సినీ బృందం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.

తాజా వార్తలు