కరోనా పుట్టినిల్లు చైనా అని నిర్ధారించేందుకు దొరికిన బలమైన ఆధారం ఇదేనటా.. ?

కరోనా ఈ పేరు వింటే ఇప్పటికి ఉలిక్కి పడేవారు ఉన్నారు.ఎప్పుడైతే దేశం దాటి వ్యాపించడం మొదలు పెట్టిందో దీని దండయాత్రకి యావత్ ప్రపంచం మొత్తం గడగడ వణికిపోయింది.

 Corona Born, China, Strongest Evidence, Research-TeluguStop.com

ఎందరో కుటుంబాలను చీకట్లోకి తోసేసింది.ఎన్నో తాళిబొట్లు వెంట తీసుకెళ్ళింది.

కుటుంబాలకు కుటుంబాలే దీని బారినపడి దిక్కులేని అనాధలు అయ్యారు.అయితే ఇంతటి విపత్తుకు కారణం అయిన చైనా మాత్రం ఈ తప్పిదం తనది కాదని బుకాయించింది.

2017లోనే దీనిని గుర్తించిన విషయం దాచిన చైనా సమస్త ప్రజల జీవితాలను సర్వనాశనం చేసింది.ఈ క్రమంలో ఇదెలా పుట్టిందని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఈ రక్కసికి పుట్టినిల్లు చైనాయేనని నిర్ధారించేందుకు మరింత బలమైన ఆధారం లభ్యమైంది.

చైనాలోని వుహాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన పరిశోధకులు కొందరు ఓ గుహలో కరోనా సోకిన గబ్బిలాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా, అవి వారిని కరిచాయట.చేతికి రబ్బరు తొడుగులు ధరించినప్పటికీ ఓ గబ్బిలం కోర చేతికి గుచ్చుకుందని ఓ పరిశోధకుడు వెల్లడించాడట.

అంతే కాదు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తమను కరోనా సోకిన గబ్బిలాలు కరిచినట్టు అంగీకరించారట.ఇంతటి కఠోరమైన నిజం బయటకు వచ్చిన సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎలా స్పందిస్తుందో మరి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube