మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జంట నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తారు.ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వివాహ మహోత్సవ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.
సినిమాలలో చూపించినట్లు కొన్ని పెళ్లిళ్లు మాత్రం చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఆగిపోతూ వుంటాయి.అలా పెళ్లిళ్లు ఆగిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
అయితే కొన్నిసార్లు ఇరు వర్గాల పెద్దలు మాట్లాడుకుని పెళ్లి తంతు కార్యక్రమాన్ని ముగిస్తారు.కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం కళ్యాణ మంటపం లోనే పెటాకులుగా మారిపోయిన సంఘటనలు మనం చూసే ఉంటాం.
ఈ తరహాలోనే ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లిలో ఒక వింత కారణం వల్ల పెళ్లి ఆగిపోయింది.పూర్తి వివరాల్లోకి వెళితే…
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక వివాహ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
పెళ్లిలో మధు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన డీజే సాంగ్ లకు ఎంతో ఆనందంగా డాన్సులు చేస్తూ వివాహా కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుతున్నారు.ఇంత ఆనంద సమయంలో వరుడు అక్కచెల్లెళ్ళు భోజనం చేయటానికి వెళ్లారు.
అయితే ఆ పెళ్లిలో వంటకాలు రుచిగాలేవని, వారికి భోజనం నచ్చలేదని వెళ్లి వధువు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
ఇంతలో వధువు బావ ఈ విషయంలో కలుగజేసుకుని వరుడి అక్కా చెల్లెళ్లతో మాటకు మాట పెరిగి వారిరువురి మధ్య గొడవకు దారి తీసింది.
అయితే వరుడు అక్కచెల్లెళ్ళు వధువు సోదరుని పై చేయి చేసుకున్నారు.వీరి ఇరువురి కుటుంబాల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో పెళ్లిలో ఒక వ్యక్తి ఈ గొడవ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పెళ్లి జరుగుతున్న కల్యాణ మంటపానికి చేరుకున్నారు.
పోలీసులు ఇరువర్గాల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయితే ఎవరి చెప్పిన ఇరు కుటుంబాల సభ్యులు రాజీకి రాకపోవడంతో, కరాఖండిగా ఈ పెళ్లి జరగదని వధువు కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.వధువు కుటుంబ సభ్యులను ఈ వివాహం జరగదని చెప్పి కల్యాణ మండపం నుంచి వధువును తీసుకొని వెళ్లిపోయారు.







