మెగాస్టార్ ని బైరెడ్డిగా మార్చేసిన మోహన్ రాజా... లూసీఫర్ రీమేక్ అప్డేట్

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

 Megastar Chiranjeevi In And As Byreddy, Mega Family, Acharya Movie, Mohan Raja,-TeluguStop.com

దీని తరువాత వరుసగా చిరంజీవి రెండు రీమేక్ లని లైన్ లో పెట్టాడు.అందులో మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ ఒకటి కాగా మరొకటి మలయాళీ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్.

ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మరో హీరో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఇదిలా ఉంటే లూసీఫర్ రీమేక్ బాధ్యతలు సుజిత్ నుంచి వివి వినాయక్ చేతికి వచ్చాయి.

ఇప్పుడు అతను కూడా తప్పుకోవడంతో తనీ ఒరువన్ దర్శకుడు మోహన్ రాజాకి దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు.ఇక మోహన్ రాజా ఈ సినిమాకి ఇప్పుడు స్క్రీన్ ప్లే రాసే పనిలో ఉన్నారు.

స్టైలిష్ మేకర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇది కావడం విశేషం.

మొదటి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేసే అవకాశం రావడంతో ఈ రీమేక్ లో అతన్ని మరింత పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇప్పటి వరకు చిరంజీవి కెరియర్ లో హీరోయిన్ లేకుండా మొదటి సారి ఈ సినిమాలో నటించబోతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం రాయలసీమ నేపధ్యంలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో సినిమాకి బైరెడ్డి అనే ఆసక్తికర టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఫ్యాక్షన్, మాఫియా లింక్ చేసే విధంగా కథ ఉంటుంది కాబట్టి ఈ టైటిల్ యాప్ట్ అని చిత్ర యూనిట్ కూడా భావించినట్లు సమాచారం.

త్వరలో దీనికి సంబందించిన అధికారిక సమాచారం బయటకి వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube