వైరల్ వీడియో: వీపు దురదగా ఉందని జెసిబి తోనే రుద్దించుకుంటున్న ఘనుడు..!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ గా మారిపోతున్నాయి.

కొందరు చేసే విచిత్ర విన్యాసాలు, వారి హావభావాలు ఇలా ఏదైనా కొత్తగా ఉంటే అందుకు సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం చూస్తూనే ఉంటాం.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పక్షులు, జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ గా మారుతుండటం గమనిస్తూనే ఉన్నాం.ఇక కొంతమంది వారి క్రేజీ ఆలోచనలతో సోషల్ మీడియాలో స్టార్ గా నిలుస్తున్నారు.

ఇలా భారతదేశంలో ఎంతో మంది ఇలా ఫేమస్ అయిన వారు ఎందరో.తాజాగా సోషల్ మీడియాలో మరొక వీడియో వైరల్ గా మారుతోంది.

అసలు ఆ వీడియో లో ఏముందంటే.ఓ పెద్దాయన జెసిబితో వీపును గోకిచ్చుకోవడం కనపడుతుంది.

Advertisement

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారిపోయింది.మామూలుగా ఎవరైనా దురద అనిపించినప్పుడు చేతగాని లేకపోతే చేతికి ఏదైనా తీసుకొని గాని వీపు భాగాన్ని గోక్కుంటారు.

కాకపోతే ఈ వీడియోలో కనిపించే పెద్దాయన మాత్రం కాస్త వెరైటీ.తన వీపుకు దురదగా అనిపించడంతో తన చేతిలో ఉన్న టవల్ తో గోక్కున్న తర్వాత అటు నుంచి కొద్ది దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జెసిబి కిందికి వెళ్ళాడు.

అరే ఏం జరగబోతోందో అని ఆలోచించే సమయానికి ఆ జెసిబి ఆ పెద్దాయన వీపును అటు ఇటు అంటోంది.నిజానికి అది చూడడానికి ఎంతో నవ్వు తెప్పించే విధంగా ఉంది.

వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్స్ ఈ వీడియోకు అనేక రకాలుగా వారి స్టైల్స్ లో కామెంట్స్ చేస్తున్నారు.కొందరు ఈ పెద్దాయన మామూలోడు కాదని కామెంట్స్ చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

తాజా వార్తలు