కువైట్ లోని “భారతీయ సంఘాలకు” కీలక సూచనలు..!!!

భారతీయ వలస కార్మికులు ఉపాది కోసం అత్యధికంగా వలస వెళ్ళే ఏకైక దేశం కువైట్.దాదాపు భారతీయ వలస కార్మికులు అక్కడ ఎక్కువగానే ఉంటారు.

 Indians  Details In Embassy, Kuwait, Orders, Indian Embassy, Indian Employees In-TeluguStop.com

కేవలం కార్మికులుగానే కాకుండా పలు రంగాలలో స్థిరపడి, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదిగిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు.ప్రాంతాలకు తగ్గట్టుగా భారతీయులు వివిధ సంస్థలు ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్న భారతీయులకు చేదోడుగా ఉంటూ ఉంటారు.

ఇలా సంఘాలు ఏర్పాటు చేసుకున్న సంస్థలు భారత ఎంబసీకి వివరాలు అందించారు.ఎప్పటికప్పుడు సమాచారం ఎంబసీకి తెలుపుతూ ఉండాలి.

ఈ క్రమంలోనే భారతీయ రాయబార కార్యాలయం భారతీయ సంఘాలకు కీలక సూచన చేసింది.

ఎంబసీ లో రిజిస్టర్ చేసుకున్న సంఘాలు అన్నీ తమ తమ ఆఫీస్ బేరర్లకు సంభందించిన అన్ని వివరాలు అప్డేట్ చేయాలని తెలిపింది.

వారికి చెందిన ఈ మెయిల్స్, అలాగే మొబైల్ నెంబర్ వంటి పలు వివరాలు , కాంటాక్ట్ అడ్రస్సులు నమోదు చేసుకోవాలని తెలిపింది.ఇందుకు గాను [email protected] కు అన్ని వివరాలు మెయిల్ చేయాలనీ తెలిపింది.

అంతేకాదు కొత్తగా ఏర్పాటు చేసుకున్న భారతీయ సంఘాలు తమని సంప్రదించవచ్చని తెలిపింది.

ఈ సంఘాలు సమాచారం తో కూడిన తమ వివరాలు పంపడానికి రాయబార కార్యకాలం కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఇచ్చింది.ఎలాంటి సందేహాలు ఉన్నా ఎంబసీ ని సంప్రదించవచ్చని తెలిపింది.

1.@indembkwt – Embassy of India, Kuwait

2.@Indian_IPN – Indian Professionals Network (IPN)

3.@IndianIbn – Indian Business Network (IBN)

4.@indian_icn – Indian Cultural Network (ICN)

5.@thematic_lib – EoI Kuwait, Thematic Library

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube