ఈ స్టార్ డైరెక్టర్లు లక్కీగా భావించే యాక్టర్లు తెలుసా...?

ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత అంతా అంతా కాదు.

చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి మొగ్గు చూపుతుంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లు కూడా ఇందుకు అతీతం కాదు.అలా కొందరు దర్శకులు సెంటిమెంట్ కోసమో, ఇతర కారణాల వల్లో కొందరు యాక్టర్లను రిపీట్ చేస్తున్నారు.

టాలీవుడ్ దర్శకధీరుడు, జక్కన్న రాజమౌళి తన ప్రతి సినిమాలో చంద్రశేఖర్ అనే యాక్టర్ కు ఏదో ఒక పాత్ర ఇస్తున్నారు.రాజమౌళి దర్శకత్వం బాహుబలి సిరీస్, యమదొంగ సినిమాలు మినహా మిగిలిన అన్ని సినిమాల్లోను శేఖర్ మనకు కనిపిస్తారు.రాజమౌళి శేఖర్ ను సెంటిమెంట్ గా భావిస్తారేమో తెలియదు కానీ దాదాపు రాజమౌళి తీసిన ప్రతి సినిమాలొను శేఖర్ కు ఖచ్చితంగా ఏదో ఒక పాత్ర సృష్టించబడి ఉండటం గమనార్హం.

దర్శకుడు హరీష్ శంకర్ సైతం ఇలాంటి సెంటిమెంట్ నే ఫాలో అవుతారు.హరీష్ దర్శకత్వం వహించిన మిరపకాయ్ సినిమా నుంచి ప్రతి సినిమాలోను రావు రమేష్ ఏదో ఒక పాత్రలో కనిపిస్తున్నారు.ఇచ్చిన ఏ పాత్రకైనా న్యాయం చేసే రావు రమేష్ లక్కీ యాక్టర్ అనే చెప్పవచ్చు.

Advertisement

హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన షాక్ మినహా మిగిలిన అన్ని సినిమాల్లోనూ రావు రమేష్ నటించారు.

వారం రోజుల్లో కథ రాసి తక్కువ సమయంలోనే సినిమా తీసే సామర్థ్యం ఉన్న పూరీ జగన్నాథ్ అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా నుంచి తన సినిమాల్లో సుబ్బరాజుకు ఏదో ఒక పాత్ర ఇస్తూ వస్తున్నారు.సుబ్బరాజుకు కెరీర్ బిగినింగ్ లో మంచి గుర్తింపు రావడానికి పూరీ ఇచ్చిన పాత్రలే కారణం అని చెప్పవచ్చు.పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 8 సినిమాల్లో సుబ్బరాజు మనకు వివిధ పాత్రల్లో కనిపించారు.

రామ్ గోపాల్ వర్మ తనికెళ్ల భరణికి, కృష్ణవంశీ బ్రహ్మాజీకి, త్రివిక్రమ్ అమిత్ అంకిత్ కు, శ్రీకాంత్ అడ్డాల రావు రమేష్ కు తాము తీసిన సినిమాల్లో ఎక్కువగా అవకాశాలిచ్చారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు