దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రాల్లో వేలల్లో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.సెప్టెంబర్ నుంచి అన్ లాక్ 4.0 ప్రక్రియ స్టార్ట్ కానుండటంతో నగరాల నుంచి సొంతూళ్లకు పయనమైన వలస కూలీలు తిరుగుబాట పడుతున్నారు.కేసులు పెరుగుతున్న దృష్ట్యా వచ్చే నెలలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా టాలీవుడ్ నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.
కరోనా వల్ల సినీ ఇండస్ట్రీ కుదేలైంది.
ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తదితర ఇండ్రస్టీల సినీ ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకోగా.మరికొందకు కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు.
కరోనా వల్ల టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.ప్రముఖ నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ కరోనా బారిన పడి కన్నుమూశారు.
గత కొంత కాలంగా కరోనా బాధ పడుతూ సికింద్రాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.నిర్మాతగా ఆయన తెలుగులో ‘ఎదురీత’ సినిమాను శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు
.