ఏంటి ఈ ధిక్కారం ? అసంతృప్తుల పై జగన్ ఫైర్ ? వారికి పిలుపు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేది.ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్న జగన్ నిర్ణయమే ఫైనల్ గా ఉంటుంది.

ఎక్కడా అసంతృప్తులకు, దిక్కరాలకు చోటే ఉండేది కాదు.మొదటి నుంచి ఇదే వైఖరి ఆ పార్టీలో ఉంటూ వచ్చేది.

తొమ్మిదేళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో నడిపించినా, ఆ పార్టీలో ఎక్కడా అసంతృప్తులు రాకుండా జగన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇక ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది.

జగన్ తన ఏడాది పాలనలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు.దేశంలోనూ, ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

ప్రశంసలు అందుకున్నారు.ఇదంతా ఇలా ఉంటే, ఇప్పుడు వైసీపీ లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అసమ్మతి రాగం వినిపించడం, అధినేత వ్యవహార శైలిని తప్పుబడుతూ మీడియా సమావేశాలు నిర్వహించడం వంటి పరిణామాలు జగన్ కు ఆగ్రహం కలిగిస్తున్నాయి.

ముఖ్యంగా జగన్ తీసుకున్న అన్ని నిర్ణయాలను తప్పుబడుతూ అసంతృప్తి వినిపించడం పై జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించడం చర్చనీయాంశమవుతోంది.

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటిషన్, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి జగన్తీరును తప్పు పట్టారు.కనీసం సీఎం ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు అవకాశం లేకపోవడం, నియోజకవర్గంలో ఏ పనులు ముందుకు సాగకపోవడం వంటి విషయాలపై ఆయన అసంతృప్తిని వెళ్లగక్కారు.

అలాగే మరో సీనియర్ నాయకుడు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా ఇదే విధంగా ఇసుక వ్యవహారంలో అధినేత తీరును తప్పుబట్టారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

ఇలా అనేక అంశాలపై అసంతృప్తులు పెరిగిపోవడం, నాయకులు ధిక్కార స్వరం వినిపించడం వంటి పరిణామాలను సీరియస్ గా తీసుకున్న జగన్ త్వరలోనే పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది .దీనిలో భాగంగానే ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు అందాయట.దీంతోపాటు జిల్లా ఇంఛార్జి మంత్రులు కూడా రావాల్సిందిగా పిలుపు అందినట్లు తెలుస్తోంది.

Advertisement

ఏదైనా సమస్య ఉంటే పార్టీలోనూ, ప్రభుత్వ పెద్దలతో చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఎవరికి వారు రోడ్డు ఎక్కి పార్టీ ప్రభుత్వ పరువు బజారున పడేయడం ఏంటని జగన్ కొంతమంది నేతలు వద్ద సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు