యూఎస్ ఎంబసీలను అత్యవసర కేటగిరీలోకి చేర్చండి: భారత ప్రభుత్వానికి ఎన్ఆర్ఐల విజ్ఞప్తి

కరోనా వైరస్ కారణంగా వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు.

వీరిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం వందే భారత్ మిషన్ పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది.

అటు దేశంలోనూ కొన్ని అత్యవసర రంగాలకు కేంద్రం మినహాయింపులు ఇచ్చింది.ఇదే సమయంలో భారతదేశంలో ఉన్న యూఎస్ ఎంబసీలను సైతం అత్యవసర కేటగిరీలోకి చేర్చాలని వివిధ పనుల నిమిత్తం మనదేశానికి వచ్చిన ప్రవాస భారతీయులు కోరారు.

ఈ మేరకు సుమారు వెయ్యిమంది ఎన్ఆర్ఐలు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.అమెరికా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు.

అమెరికాకు వెళ్లేందుకు చెల్లుబాటయ్యే వీసాను మంజూరు చేసే అత్యవసర విభాగాలని వారు భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.భారత్‌లో చిక్కుకుపోయిన ప్రవాసులకు వీసాలు జారీ చేసేందుకు గాను మనదేశంలోని యూఎస్ ఎంబసీలను అత్యవసర కేటగిరీలోకి చేర్చాలని కోరారు.

Advertisement

కోవిడ్ 19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉండటంతో భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాలు మార్చి 16 నుంచి సాధారణ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేశాయి.ఆ తర్వాత భారత ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో యూఎస్ ఎంబసీలు పూర్తిగా మూతపడ్డాయి.

కాగా హెచ్ 1బీ, హెచ్ 4 వీసాదారుల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న అతిపెద్ద ఫేస్‌బుక్ గ్రూపును నిర్వహిస్తున్న నేత్రా చవాన్.భారతీయ, అమెరికా రాయబార కార్యాలయాల పునరుద్ధరణపై ఇరు దేశాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదని ఆమె అన్నారు.భారతదేశంలో చిక్కుకుని వీసాల కోసం ఎదురుచూస్తున్న చాలామంది దీని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పిటిషనర్లలో ఎక్కువ మంది అత్యవసర పనుల నిమిత్తం భారతదేశానికి వెళ్లారు.

అయితే వీరి పరిస్ధితి ప్రస్తుతం సందిగ్ధంలో పడింది .ఎందుకంటే వీరి భార్యాపిల్లలు, ఉద్యోగాలు అమెరికాలోనే ఉన్నాయి.వీరిలో ఎక్కువమంది హెచ్ 1 బీ వీసాపై వున్నవారే.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

వీరి వీసా గడువు త్వరలో ముగియనుండటంతో.రెన్యువల్‌కు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

అయితే ప్రస్తుతం భారతదేశంలో యూఎస్ ఎంబసీలు మూసివేసినందున వీరి పరిస్ధితి ఆందోళనకరంగా మారింది.ఒకవేళ గడువు ముగిసేలోగా వీసా రెన్యువల్ జరగకపోతే తాము భారత్‌లోనే ఉండిపోవాలని ఎన్ఆర్ఐలు కంగారు పడుతున్నారు.

తాజా వార్తలు