తారక్ గిఫ్ట్‌పై నీళ్లొదిలేసిన త్రివిక్రమ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో మరోసారి తన నటవిశ్వరూపాన్ని మనకు చూపించనున్నాడు.

ఇక ఈ సినిమా పూర్తికాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ప్రారంభించాడు.ఇప్పటికే అఫీషియల్‌గా లాంఛ్ అయిన ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుక సన్నాహాలు చేస్తున్నారు.

ఇక మే 20న తారక్ పుట్టినరోజున అదిరిపోయే గిఫ్టులను ఆశిస్తున్న నందమూరి ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే మిగలనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు వీడియోను కూడా రిలీజ్ చేశారు.

కాగా మే 20న తారక్‌కు సంబంధించి కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వస్తుందని, ఎలాంటి వీడియో రాదని తెలుస్తోంది.ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి వీడియోను చేయలేకపోయామని ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ అంటోంది.

Advertisement

పోనీ ఆర్ఆర్ఆర్ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు త్రివిక్రమ్-తారక్ సినిమా లుక్ కూడా వస్తే తమకు నిజమైన పండగ అని భావించిన ఫ్యాన్స్‌కు, ఈ విషయంలోనూ నిరాశే మిగలనుంది.త్రివిక్రమ్ తారక్ చిత్రానికి సంబంధించి ఎలాంటి పని మొదలుకాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.

దీంతో కేవలం తారక్‌కు శుభాకాంక్షలు తెలిపే పోస్టర్ ఒకటి రిలీజ్ చేసేందుకే త్రివిక్రమ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట.ఇలా ఈసారి తారక్ పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుందామనుకుంటున్న ఫ్యాన్స్‌కు అటు జక్కన్నతో పాటు ఇటు త్రివిక్రమ్ కూడా హ్యాండ్ ఇచ్చారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మరి ఆర్ఆర్ఆర్ ఫస్ట్ లుక్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే అంటున్నారు అభిమానులు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు