చప్పట్లు కొట్టాలన్నందుకు స్టార్ హీరోపై కేసు

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు.

 Case Against Mohanlal For False Statements On Corona-TeluguStop.com

అయితే మార్చి 22న జనతా కర్ఫ్యూను ప్రధాని నరేంద్ర మోది ప్రకటించగా, దానిలో అందరూ పాల్గొన్న సంగతి తెలిసిందే.కాగా ఈ జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు అందరూ తమ బాల్కనీల్లోకి వచ్చి చప్పట్లు కొట్టి విధిలో ఉన్న వైద్యులు, అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి కూడా తెలుసిందే.

కాగా ఈ అంశంపై కొన్ని కామెంట్స్ చేసినందుకు గాను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌పై మానవ హక్కుల సంఘంలో శ్రీను అనే వ్యక్తి కేసు నమోదు చేశాడు.చప్పట్లు కొట్టడం వల్ల కరోనా లాంటి వైరస్‌లు చనిపోతాయని మోహన్ లాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారట.

ఇది ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.చప్పట్ల శబ్దం నుంచి ఓ మంత్రం లాంటిది పుట్టుకొస్తుందని, తద్వారా అన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్‌లు హతమవుతాయని మోహన్ లాల్ పేర్కొన్నాడు.

దీంతో ఈ కామెంట్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇలా ఓ సెలబ్రిటీ అయ్యి ఉండి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం చాలా తప్పని పలువురు మోహన్ లాల్‌ను ట్రోల్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube