నాగబాబు సారధ్యంలో జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది కామెడీ షో రేటింగ్ విషయంలో చాలా వెనుకబడి ఉంది.జబర్దస్త్‌తో పోల్చితే అదిరింది ఏమాత్రం ఆశాజనకంగా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయినా కూడా యూనిట్ సభ్యులు జబర్దస్త్‌ను ఢీ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.యాంకర్‌ను మార్చి ప్రయత్నించాలని తాజాగా యాంకర్‌ను కూడా మార్చడం జరిగింది.
తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్‌లో సమీరా కాకుండా రవి మరియు భానుశ్రీలు కనిపించడంతో అంతా కూడా ఆశ్చర్యపోయారు.

ఎపిసోడ్ అయినప్పటి నుండి సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున వస్తూనే ఉన్నాయి.సమీరా ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తప్పుకుందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.మరి కొందరు షో ను మరింత ఆకర్షనీయంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
మొత్తానికి అదిరింది కార్యక్రమానికి సమీరాను తొలగించి భాను మరియు రవిని తీసుకు రావడంపై సర్వత్రా చర్చనీయాంశం అవుతూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సమీరా మీడియా ముందుకు వచ్చింది.తనను అదిరింది షో నుండి తప్పించారంటూ చెప్పుకొచ్చింది.విచిత్రం ఏంటీ అంటూ తనను తప్పిస్తున్న విషయం తనకు కూడా చెప్పలేదని ఆమె వాపోయింది.
షో మంచి కోసం తాను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను అంది.ఇక ఈ షోను తాను ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల వదిలేయలేదు అంది.
వారు నన్ను 26 ఎపిసోడ్స్‌కు ఒప్పందం చేసుకున్నారు.కాని 10 ఎపిసోడ్స్‌కే ముగించారు.
మళ్లీ ఛాన్స్ వస్తుందేమో అని ఆశిస్తున్నట్లుగా సమీరా చెప్పుకొచ్చింది.







