కేసీఆర్ జగన్ మధ్య పెరిగిన పోటీ ?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కెసిఆర్ మధ్య ఇప్పుడు ఆసక్తికరమైన పోటీ నెలకొంది.

అయితే అది రాజకీయంగా కాకుండా, ప్రజా సంక్షేమ పథకాల అమలు విషయంలో వీరిద్దరు పోటీపడుతున్నారు.

జనం నాడి ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు ఎటువంటి పథకాలు కావాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటారు, ఇలా అనేక విషయాలు ముందుగానే పసిగట్టడం లో కేసీఆర్, జగన్ ఇద్దరు ఇద్దరే.ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రజాసంక్షేమ పాతకాలను అమలు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చారు.

అదేవిధంగా ఏపీ సీఎం జగన్ కూడా తన తొమ్మిది నెలల పరిపాలన కాలంలో ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు, నిర్ణయాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు కూడా జగన్ అమలు చేస్తున్న పథకాలు, నిర్ణయాలపై ఆసక్తి చూపిస్తున్నాయి.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకు రావడంతో ఇప్పుడు ఆ చట్టం పై మహారాష్ట్ర కూడా ఆసక్తి చూపిస్తోంది.త్వరలోనే మహారాష్ట్ర ఆ చట్టాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే అక్కడి అధికారులు, మంత్రుల బృందాన్ని ఇక్కడికి పంపింది.

Advertisement

వారు ఏపీ కి వచ్చి ఆ చట్టం అమలు తీరును, విధివిధానాలను పరిశీలిస్తున్నారు.ఈ విధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజా సంక్షేమం విషయంలో ముందుంటున్నారు.

ఇప్పుడు తెలంగాణ, ఏపీ సీఎంలు ఇద్దరు మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు.ఏపీ లో కొత్తగా వైఎస్ఆర్ విలేజ్ లను ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ తీర్మానించారు.

ఈ మేరకు గురువారం ఆరోగ్య శాఖ సమీక్ష చేపట్టారు.గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటల పాటు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల ఏర్పాటు చేసే దిశగా జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

24 గంటల పాటు నిత్యం బీఎస్సీ నర్సింగ్ చేసిన వారిని అందుబాటులో ఉండేలా తీర్మానించారు.అలాగే జూలై 8న వైయస్ఆర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రారంభించాలని జగన్ భావిస్తున్నారు.ఈ పథకానికి డాక్టర్ వైఎస్ఆర్ చిరునవ్వు అనే పేరు పెట్టారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా గురువారం మరో పథకానికి శ్రీకారం చుట్టారు కెసిఆర్ పేరిట త్వరలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నారు.ఎంబీసీ కేటగిరీకి చెందిన ఐదుగురు యువకులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారికి ఒక అంబులెన్సు ను పంపిణీ చేస్తారు.

Advertisement

ముందుగా ఈ పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒకటి చొప్పున యూనిట్లను ప్రారంభించబోతున్నారు.అదే పథకం కింద పదివేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.

వారికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కెసిఆర్ శ్రీకారం చుట్టారు.ఈ విధంగా ఇద్దరూ ఒకేరోజు పోటా పోటీగా దాదాపు ఒకేరకమైన పథకాలను ప్రారంభించడం చర్చనీయాంశం అవుతోంది.

తాజా వార్తలు