డెవిల్ కి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా...?

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ నటించినటువంటి అర్జున్ రెడ్డి చిత్రానికి దర్శకత్వం వహించిన టువంటి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ఫెమ్ సంపాదించినటువంటి సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి చిత్రాన్ని బాలీవుడ్లో లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా మంచి విజయం సాధించాడు.

 Prabhas And Sandeep Vanga Latest Update News-TeluguStop.com

అయితే తాజాగా సందీప్ రెడ్డి తన కొత్త చిత్రం కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఓ కథతో సంప్రదించగా రణవీర్ సింగ్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో నో చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఇదే కథను టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించగా ప్రభాస్ ఓకే చేసినట్లు సమాచారం.

అంతేగాక కథాంశంలో కొంతమేర స్వల్ప మార్పులు కావాలని హీరో ప్రభాస్ దర్శకుడుని కోరడంతో కొంతమేర మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డాడు దర్శకుడు సందీప్ రెడ్డి.అంతేకాక ఈ చిత్రాన్ని నిర్మించేందుకు టాలీవుడ్లో పలు పెద్ద తరహా చిత్రాలను నిర్మించినటువంటి ఓ బడా నిర్మాత కూడా నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయాలపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాకపోయినప్పటికీ నెట్టింట్లో మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.

Telugu Devil, Prabhas, Sandeepreddy, Tollywood-Movie

అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ ప్రముఖ దర్శకుడు రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న టువంటి జాన్ అనే చిత్రంలో నటిస్తున్నారు.ఈ చిత్రంలో టాలీవుడ్ గ్లామర్ క్వీన్ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రం లో విడుదల కానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube