దారుణం: పోలీసులం అని చెప్పి గ్యాంగ్ రేప్,పట్టుకొనేందుకు యత్నించగా దుండగుడు మృతి

సంగారెడ్డి జిల్లా లో దారుణం చోటుచేసుకుంది.తాము పోలీసులం అని చెప్పి బస్సు లో ఉన్న ఆ మహిళను బెదిరించి కిందకు దింపి నిర్మానుష ప్రాంతాల్లో ఆమె పై గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్లు తెలుస్తుంది.వివరాల్లోకివెళితే… సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో మంగళవారం రోజు బీదర్ నుంచి సూర్యాపేటకు ఒక వెళుతుండగా,ఆమె వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నట్లు గమనించిన ఇద్దరు దుండగులు పోలీసులం అని బెదించి బస్సు నుంచి కిందకు దింపేశారు.అనంతరం ఆ మహిళను ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె పై దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తుంది.

 Gangrape Accused Dead In Road Accident-TeluguStop.com

అయితే అనంతరం అక్కడ నుంచి బయటపడిన ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్టాండ్ వద్ద,ఇతర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజీ లను పరిశీలించి దుండగులను పట్టుకొనే పనిలో పడ్డారు.అయితే ఈ క్రమంలోనే బుధవారం రాయికొడ్ మండలం మహా బూత్పుర్ దగ్గర న్యాల్కల్ సీఐ కృష్ణకు కంట పడ్డారు.

దీనితో వారిని పట్టుకుంటారు అన్న ఉద్దేశ్యం తో వారు పారిపోయేందుకు ప్రయత్నించారు.మరోపక్క వారిని చూసి పారిపోతున్న నిందితులను ఎలాగైనా పట్టుకోవాలి అన్న ఉద్దేశ్యం తో తమ వాహనంలో వెంబడించారు పోలీసులు.

ఎలాగైనా పోలీసులకు దొరకకూడదు అంటూ వారు వెళ్తున్న కారును వేగంగా నడపడంతో.అది కాస్త అదుపు తప్పి బోల్తా పడింది.

దీనితో ఈ ప్రమాదంలో ఇద్దురు నిందితుల్లో ఒకడు అక్కడికక్కడే మృతిచెందగా.మరొకరు తీవ్రంగా గాయపదినట్లు సమాచారం.

ప్రస్తుతం మరో నిందితుడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టడుతున్నాడు.అయితే అసలు వారు ఎవరు ఎక్కడ నుంచి వచ్చారు? అసలు వివరాలు ఏంటి అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube