తెలుగు సినీ పరిశ్రమలో దాదాపుగా 150 సినిమాల్లోకి పైగా నటించి టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు పొందినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారుండరు.అంతేగాక చాలామంది ఇప్పటితరం హీరోలకు ఇన్స్పిరేషన్ గానిలుస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన త్రిష నటిస్తోంది.అయితే ఈ చిత్రం చాలా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రా టైటిల్ కి సంబంధించి నటువంటి ఓ వార్త ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.
అదేంటంటే దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి “ఆచార్య” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు మరియు ఇప్పటికే ఈ చిత్ర టైటిల్ రిజిస్ట్రేషన్ విషయమై మూవీ కౌన్సిల్ సభ్యులను కూడా సంప్రదించినట్లు సమాచారం.అయితే ఈ విషయాలపై దర్శకుడు కొరటాల శివ మాత్రం ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు.

అయితే ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన టువంటి సైరా నరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో చిరంజీవి తన తదుపరి చిత్రంలో ఎటువంటి తప్పు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.అంతేగాక దర్శకుడు కొరటాల శివ కూడా ఇందుకు తగ్గట్టుగానే తీవ్రంగా శ్రమిస్తున్నాడు.