యంగ్ హీరో నితిన్ టాలీవుడ్‌లో జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా మలుచుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు తేజ డైరెక్ట్ చేయడంతో అందాల భామ సదా కూడా ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది.
ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.కథ పరంగా ఈ సినిమా అప్పట్లో అదిరిపోయే టాక్‌ను తెచ్చుకోవడమే కాకుండా ఇప్పటికీ టీవీల్లో ప్రసారమవుతూ అదిరిపోయే టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది.
ఇక ఈ సినిమాను తమిళంలో కూడా అప్పుడే రీమేక్ చేశారు చిత్ర యూనిట్.కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత ఈ సినిమాను మళ్లీ రీమేక్ చేస్తు్న్నారు.
అయితే ఈసారి కన్నడలో జయం సినిమాను రీమేక్ చేస్తున్నారు.ప్రవీణ్ అనే కొత్త హీరో ఈ సినిమాతో శాండిల్‌వుడ్‌లో పరిచయమవుతున్నాడు.
రియల్ లైఫ్‌లో డాక్టర్ అయిన ప్రవీణ్, ఈ సినిమా కోసం ఏడాదిపాటు నటనలో ట్రెయినింగ్ తీసుకున్నాడట.
మరి తెలుగు,తమిళంలో సూపర్ సక్సె్స్ అయిన జయం సినిమా కన్నడ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.జయం అక్కడి విజయం సాధిస్తుందో లేక పరాజయం పాలవుతుందో చూడాలి.







