యాంగ్రీ యాంగ్ మెన్ రాజశేఖర్ చివరిగా కల్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.ఆ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది.
ఈ మధ్య కాస్తా డిఫరెంట్ జోనర్ ని టచ్ చేస్తున్న రాజశేఖర్ ఈ సారి మల్టీ స్టారర్ సినిమాతో రావడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.తన కెరియర్ ఆరంభంలో ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రాజశేఖర్ స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత ఎక్కువగా సోలో కథలనే చేశాడు.
మా అన్నయ్య లాంటి సినిమాలు చేసిన కూడా అందులో మల్టీస్టారర్ కోవలోకి వెళ్ళలేదు.ఇదిలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓ మల్టీ స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.రాజశేఖర్ తో పాటు మరో యువ హీరో ఇందులో నటించబోతున్నారని సమాచారం.ఆ సెకండ్ హీరో పాత్ర కోసం శ్రీవిష్ఱు, కార్తికేయల పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అహనా పెళ్లంట సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వీరభద్రం నాగార్జునతో భాయ్ అనే సినిమా తీసి నేరుగా అతనితోనే చివాట్లు తిన్నాడు.
తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఆదితో చుట్టాలబ్బాయ్ సినిమా తీసిన అది ఎందుకు తీసాడో కూడా అర్ధం కాని విధంగా అయిపొయింది.దీంతో మరో సినిమాకి చాలా గ్యాప్ తీసుకొని తాజాగా రాజశేఖర్ తో కథ ఒకే చేయించుకున్నట్లు తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో అయిన ఈ దర్శకుడు తిరిగి పుంజుకుంటాడో లేదో చూడాలి.







