సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీ నయనతార ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల నయనతారకు ఆ పేరు పెట్టింది నేనే అంటే నేనే అని ఇద్దరు దర్శకులు సోషల్ మీడియా వేదికగా కొట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ వివాదం మరవకముందే మరో వివాదంలో నయన్ చిక్కుకుంది.ఆమె నిర్మాతల జేబులకు చిల్లు పెడుతుందంటూ ప్రముఖ నిర్మాత కె.రాజన్ మండిపడుతున్నారు.
సాధారణంగా సినిమా ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు హీరోయిన్లకు రెమ్యునరేషన్‌తో పాటు వారి పర్సనల్ ఖర్చులు కూడా చూడాల్సి ఉంటుంది.
కానీ నయనతార వద్ద ఏడుగురు అసిస్టెంట్లు ఉన్నారని, వారి జీతభత్యాలు కూడా చూడాల్సి వస్తుందని రాజన్ మండిపడ్డారు.ఎవరైనా స్టార్లు వారి అసిస్టెంట్లకు వారే జీతాలు చెల్లించుకుంటారు.
కానీ నయనతార విషయంలో ఆ లెక్కలు కూడా నిర్మాతల అకౌంట్‌లో వేయడం ఎంతవరకు సబబు అని రాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నయనతార తనకున్న డిమాండ్‌ను ఈ విధంగా వినియోగించుకుని నిర్మాతలతో వృథా ఖర్చులు పెట్టించడం ఏమాత్రం మంచిది కాదని ఆయన మండిపడ్డారు.
మరి రాజన్ వ్యాఖ్యలపై నయనతార ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు కోలీవుడ్ వర్గాలు.







