జనసేన బిజెపి రాజకీయంగా ఒక్కటిగా కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి అనే సంకేతాలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.కొద్దిరోజులుగా ఏపీ, ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇవే సంకేతాలు వెలువడుతున్నాయి.
బీజేపీలో జనసేన పార్టీని విలీనం చేసుకుని ఏపీలో రాజకీయంగా బలపడాలని, అందుకు తగ్గట్టుగానే రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది బీజేపీ.అయితే పవన్ మాత్రం జనసేన ని బీజేపీ లో విలీనం చేయకుండా కేవలం పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
దీని కారణంగానే ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం ఒక క్లారిటీ కి రాకుండా పోతోంది.ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ కేంద్ర బిజెపి పెద్దలను కలిసేందుకు ప్రయత్నించినా వారు విలీనం అంశం గురించి అయితే తప్ప మిగతా ఏ విషయాల గురించి పవన్ తో చర్చించేందుకు సిద్ధంగా లేము అన్నట్టుగా సంకేతాలు పంపించారు.

అందుకే పవన్ కు అపాయింట్మెంట్ కూడా దక్కలేదు.రెండు మూడు రోజులపాటు ప్రయత్నించినా బిజెపి అగ్రనేతలు అపాయింట్మెంట్ పవన్ కు దక్కకపోవడంతో అందుబాటులో ఉన్న ఒకరిద్దరు నాయకులను కలిసి పవన్ ఈ అంశంపై చర్చించినట్టు సమాచారం.అలాగే ఆర్ఎస్ఎస్ నాయకులను కూడా కలిసి ఇదే విషయంపై రహస్యంగా పవన్ చర్చించారని వార్తలు కూడా వచ్చాయి.అయితే బీజేపీ మాత్రం విలీనం అనే మాటమీదే నిలబడుతోంది.
దీనికి సంబంధించి ఈనెల 16వ తేదీన అంటే రేపు జనసేన- బిజెపి పార్టీల మధ్య ఓ కీలక సమావేశం జరగబోతోంది.

ఈ సమావేశంలో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్లే విషయమై సుదీర్ఘంగా చర్చించి, ఒక నిర్ణయానికి రాబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఏపీ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా బిజెపి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.ముఖ్యంగా రాజధాని వ్యవహారం గందరగోళంగా ఉండటంతో ఏపీకి వచ్చే పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోవడం, రాజకీయ దాడులు జరగడం, అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళన తదితర విషయాలపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది.
అధికార వికేంద్రీకరణ జరిగితే మంచిదేనని కానీ వైసిపి నాయకులు చెప్పే వికేంద్రీకరణ పై బీజేపీకి ఇంకా అనుమానాలు పోలేదు.ఈ నేపథ్యంలో బీజేపీ జనసేన పార్టీల మధ్య రేపు చర్చల్లో ఏ క్లారిటీ వస్తుంది అనే విషయంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.







