జాను టీజర్ టాక్.. మక్కీకి మక్కీ దించేశారు

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 మూవీ ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.ఆ సినిమాను తమిళం రాని తెలుగు వారు కూడా చాలా మందే చూశారంటే ఆ సినిమాలో ఎంత లీనమయ్యారో మనం అర్ధం చేసుకోవచ్చు.

 Jaanuteaser Talk-TeluguStop.com

ఇంత చక్కటి లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు సరికొత్తగా రీమేక్ ద్వారా అందించాలని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను జాను అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల జాను ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా జాను టీజర్‌ను రిలీజ్ చేశారు.

తమిళంలో 96 సినిమా చూసినవారికి ఈ టీజర్‌లో కొత్తదనమేమి కనిపించదు.కానీ ఆ సినిమా చూడని వారికి మాత్రం ఇదొక అదిరిపోయే ట్రీట్ అని చెప్పాలి.టీజర్ మొత్తం ఓ ఫీల్‌గుడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సాగుతోంది.శర్వానంద్ లుక్, సమంత మేకోవర్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి.

ఇక సమంత ‘‘చాలా దూరం వెళ్లిపోయావారా.?’’ అని అడిగిన ప్రశ్నకు, ‘‘నిన్ను ఎక్కడ వదిలేశానో అక్కడే ఉన్నాను’’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది.

స్కూల్ లైఫ్‌లోని ప్రేమకథను మనకు ఈ సినిమాలో చూపించనున్నారు.మొత్తానికి 96 ఫ్లేవర్‌ను ఏమాత్రం మిస్ కాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్త పడ్డారు.ఈ టీజర్ జాను సినిమాపై అంచనాలను క్రియేట్ చేసిందనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు.మరి ఈ సినిమా 96 లాంటి విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

తమిళంలో 96 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ జాను సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube