సూపర్ స్టార్ రజినీకాంత్ గత సంవత్సరం నుండి సినిమాల స్పీడ్ చాలా పెంచాడు.గతంలో సంవత్సరంకు ఒకటి మాత్రమే విడుదల చేసేవాడు.
కొన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్కటి వచ్చిన దాఖలాలు కూడా లేవు.కాని ఇప్పుడు మాత్రం వరుసగా సినిమాల్లో నటించేందుకు రజినీకాంత్ ఆసక్తి చూపుతున్నాడు.
అది కూడా చాలా స్పీడ్‌గా సినిమాలు పూర్తి అయ్యేలా దర్శకులకు సూచిస్తున్నాడు.మురుగదాస్‌తో దర్బార్ చిత్రాన్ని చేసిన రజినీకాంత్ కేవలం నాలుగు అయిదు నెలల్లోనే పూర్తి చేశాడు.
ఇప్పుడు శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న దర్బార్ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా రజినీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.తాను గతంలో చేసిన చంద్రముఖి సినిమాకు ఎవరైనా సీక్వెల్ తీసుకు వస్తే తప్పకుండా నటిస్తాను అన్నాడు.
గతంలోనే చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ను తీయడం జరిగింది.అయితే దాంట్లో వెంకటేష్ నటించాడు.
నాగవళ్లి అనే టైటిల్‌తో రూపొందిన ఆ చిత్రం ఫ్లాప్ అయ్యింది.

నాగవళ్లి చిత్రంలో మొదట రజినీకాంత్‌ను అనుకున్నారు.తెలుగు మరియు తమిళంలో చేయాలనుకున్నారు.కాని తెలుగులో మాత్రమే దాన్ని తీశారు.
అది కూడా సక్సెస్ అవ్వలేదు.రజినీకాంత్ అప్పుడు చంద్రముఖి సీక్వెల్‌పై ఆసక్తి చూపించక పోవడం చాలా మంచిది అయ్యిందని అంటున్నారు.
ఇక ఇప్పుడు చంద్రముఖి సీక్వెల్‌ను చేయాలని ఉందని అంటున్న రజినీకాంత్‌కు కథలు ఏమైనా దొరికేనా చూడాలి.వచ్చే ఏడాది వరకే రజినీకాంత్ సినిమాలు చేస్తాడు.
ఆ తర్వాత తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.కనుక చంద్రముఖి సీక్వెల్ అనేది సాధ్యం కాకపోవచ్చు అంటూ తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.







