మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకప్పుడు సినిమాలు వేరు ఇప్పుడు చేస్తున్న సినిమాలు వేరు.ఒకప్పుడు మంచి బలమైన కంటెంట్‌తో మంచి కామెడీతో సినిమాలు చేసేవాడు.
కాని ఇప్పుడు పరిస్థితి మారింది.ఇప్పుడు కేవలం హై బడ్జెట్‌కే ప్రాముఖ్యత ఇస్తున్నాడు.
కంటెంట్ కంటే బడ్జెట్ విషయాలకు త్రివిక్రమ్ ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి.త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన, రాబోతున్న సినిమాలు చూస్తుంటే బడ్జెట్ మరీ భారీగా ఉంటున్నాయి.

ముఖ్యంగా అత్తారింటికి దారేది సినిమా నుండి మొదలుకుని మొన్నటి అరవింద సమేత త్వరలో విడుదల కాబోతున్న అల వైకుంఠపురంలో సినిమాల బడ్జెట్‌లు నిర్మాతలకు గుబులు పుట్టిస్తున్నాయి.ఒక చిన్న హీరో అయిన నితిన్‌తో ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టి అఆ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇక అల వైకుంఠపురంలో సినిమాకు దాదాపుగా 60 కోట్లు ఖర్చు చేశాడనే టాక్ వినిపిస్తుంది.సామజవరగమనా అనే పాట కోసం 5.5 కోట్ల రూపాయలను త్రివిక్రమ్ ఖర్చు చేశాడంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

అల్లు అరవింద్ ఈ చిత్రం బడ్జెట్‌ను ఎంత నియంత్రించేందుకు ప్రయత్నించినా కూడా త్రివిక్రమ్ మాత్రం ముందుకు దూసుకు వెళ్లాడట.మరో నిర్మాత రాధాకృష్ణ పూర్తి సపోర్ట్ ఇవ్వడం వల్లే త్రివిక్రమ్ భారీగా సినిమా చేశాడు.త్రివిక్రమ్ బడ్జెట్‌ను కేవలం రాధాకృష్ణ మాత్రమే తట్టుకోగలడు.
అందుకే వరుసగా త్రివిక్రమ్ ఆయన బ్యానర్‌లోనే చేస్తున్నాడు.త్రివిక్రమ్ ఈ భారీ బడ్జెట్ చిత్రాలను ఇంకా ఎప్పటికి మానేస్తాడో చూడాలి.







