వృద్ధులకు అండగా నిలిచేందుకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్ ద్వారా వారికి ఆర్ధిక సాయం అందిస్తు్న్నాయి.అయితే ఈ పింఛన్ పథకంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
దీంతో వాటిని అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.కాగా ఓ వృద్ధురాలి విషయంలో మాత్రం అధికారుల డొల్లతనం స్పష్టంగా బట్టబయలు అయ్యింది.
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో కాచిరెడ్డి అశ్వర్థమ్మ (104) అనే వృద్ధురాలికి ఆధార్ కార్డులో నాలుగేళ్ల వయసని తప్పుగా ప్రచురించబడింది.దీంతో ఆమె పన్షన్ కోసం అధికారులు చుట్టు కాళ్ల చెప్పులు అరిగేలా తిరిగింది.
అయినా ఆమె మొరను ఎవరూ పట్టించుకోలేదు.నాలుగేళ్ల పాపకు పెన్షన్ ఎలా ఇస్తామంటూ వారు తేల్చి చెప్పేశారు.
దీంతో ఆమె ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితో ఉంది.
ఇక అధికారులు ఇప్పుటికైనా ఆమె ఆధార్ కార్డులోని తప్పులను సరిచేసి ఆమెకు పెన్షన్ వచ్చేలా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ విషయంపై ఉన్నతాధికారులు సత్వరమే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.







