దేశ వ్యాప్తంగా ఈ మధ్యకాలంలో మహిళల మీద అత్యాచారాలకి సంబందించిన ఘటనలు ఎక్కువవుతున్నాయి.అయితే గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన చాలా మంది సమాజానికి భయపడి, న్యాయం స్థానాల మీద నమ్మకం లేకపోవడంతో పాటు, పలుకుబడి, రాజకీయ ఒత్తిళ్ళు, పంచాయితీలలో సెటిల్మెంట్ ల నేపధ్యంలో పోలీస్ స్టేషన్ వరకు రాలేదు.
అయితే ప్రస్తుతం దేశం వ్యాప్తంగా ఈ ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, హత్యల గురించి చర్చ నడుస్తుంది, అలాగే నిర్భయ యాక్ట్ తో పాటు, తాజాగా హైదరాబాద్ లో దిశ సంఘటన తర్వాత పోలీసులు, న్యాయస్థానం కూడా మహిళలకి అండగా నిలబడుతున్నాయి.ఇలాంటి అత్యాచార ఘటన గురించి కేసు నమోదై ఆధారాలతో సహా రుజువైతే కఠిన శిక్షలు వేయడానికి రెడీ అయ్యాయి.
దీంతో చాలా మంది అత్యాచార బాధితులు బయటకి వస్తున్నారు.ఈ నేపధ్యంలో వీటికి సంబందించిన కేసులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఓ అత్యాచార ఘటనకి సంబంధించి న్యాయస్థానం కేవలం 17 రోజుల్లో తీర్పు ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.తాజాగా నాలుగేళ్ళ బాలికపై హత్యాచారానికి ఒడిగట్టిన మృగాడికి మహారాష్ట్రలో ప్రత్యేక న్యాయస్థానం కేవలం 17 రోజుల్లోనే నిందితుడుకి యావజ్విజీవ కారాగారశిక్ష ఖరారు చేసింది రాజస్థాన్‌కు చెందిన దయారాం అనే వ్యక్తి నవంబర్ 30న నాలుగేళ్ళ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
పోలీసులు ఆ మృగాడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.ఇక డిసెంబర్ 7వ తేదీన పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేయగా ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసుపై విచారణ చేపట్టి దయారాంను దోషిగా తేల్చి యావజ్జీవ శిక్షను ఖరారు చేస్తూ తుదితీర్పును వెల్లడించింది.
ఈ కేసులో నిందితుడికి శిక్ష 17 రోజుల్లో పడగా పోలీసులు వారం రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం.ఈ శిక్ష నేపధ్యంలో ఇప్పుడు అత్యాచార ఘటనలలో ఇదే స్థాయిలో సత్వర న్యాయం జరిగేలా చూడాలని మహిళా సంఘాలు కోరుకుంటున్నాయి.







