యావత్ భారతదేశంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఉల్లి.పెరిగిన ఉల్లి ధరతో సామాన్య ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యమే ఉల్లి ధర పెంపుకు కారణం అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.అయితే ఉల్లి ధర పెరగడంతో సోషల్ మీడియాలో మాత్రం ఉల్లిపై తెగ ట్రోల్స్ నడుస్తున్నాయి.
ముఖ్యంగా ఉల్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా కర్ణాటకలో ఓ వివాహ వేడుకలో కొత్త జంటకు బహుమతులు ఇచ్చే క్రమంలో ఓ బంధువు ఓ పెద్ద ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు.
ఆ నూతన జంట అందులో ఏముందా అంటూ దానిని ఆతృతగా తెరిచి చూశారు.అందులో ఉల్లిపాయల బౌల్ ఉండటం చూసి వారు నవ్వుకున్నారు.
అక్కడున్న వారు కూడా ఈ తతంగం చూసి నవ్వుకున్నారు.ఇదిలా ఉంటే, ఒకచోట ఇదే ఉల్లి ఏడుపులు తెప్పించింది.
ఉత్తరాఖండ్ కాంగ్రెస్ నేత నందన్ మెహ్రా ఉల్లి కోసం సామాన్యులు పడుతున్న కష్టాన్ని చూసి కిలో ఉల్లిని రూ.30కి అందించాలని చూశాడు.అయితే ఇదంతా చూసిన ఓ వ్యక్తి ఆగ్రహంతో ఊగిపోయి నెహ్రా చేతివేలిని గట్టిగా కొరికాడు.దీంతో నెహ్రా వేలికి గాయమైంది.కాగా బీజేపీకి చెందిన వ్యక్తే ఇలా చేసాడంటూ కాంగ్రెస్ నేతలు మండిపడగా, సదరు వ్యక్తి మావాడు కాదంటూ భుజాలు తడిమారు భాజాపా నేతలు.







