నిస్వార్థమైన సేవకు, త్యాగానికి ప్రతీక సైనికుడు.కుటుంబాన్ని, సన్నిహితులను వదిలి సరిహద్దుల్లో కాపు కాస్తుంటాడు.
అలాంటి త్యాగమే చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడాడు ఓ సైనికుడు.వివరాల్లోకి వెళితే.
అమెరికాకు చెందిన ఎజ్రా మేస్ అనే సైనికుడు తన కాలిని పోగొట్టుకుని మూడు ప్రాణాలను రక్షించాడు.గతేడాది స్లోవేకియాలో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ సమయంలో ఎం1ఏ2 టాంకర్ కు లోడర్ గా పని చేశాడు.
ఓ రోజు రాత్రి మేస్ తో మరో ఇద్దరు సైనికులతో కలిసి టాంకర్ లో పడుకున్నాడు.
అయితే ఉన్నపళంగా టాంకర్ కదలడం ప్రారంభించింది.వెంటనే దీనిని గుర్తించిన వారు బ్రేక్ ఫెయిల్ అయి ఉండొచ్చని గుర్తించారు.
దానిని ఆపేందుకు ఎంతగానో ప్రయత్నించారు.కానీ ఇవేమి ఫలించలేదు.
అయితే అక్కడ ఉన్న చెట్లలో ఎదో ఒక చెట్టుని ఢీకొట్టి టాంకర్ నిలిచిపోతుందని క్రూ సిబ్బంది భావించారు.కానీ ఊహించని విధంగా టాంకర్ గంటకు ౩౦ కి.మీ వేగంతో కిందకు వెళుతూ.చెట్లను, బండరాళ్లను కొట్టుకుంటూ దూసుకెళ్తోంది.
చివరికి ఒక రాతి కట్టడాన్ని ఢీకొట్టి నిలిచిపోయింది.ఈ సమయంలో ఎజ్రా మేస్ కాలు ట్యాంక్ కింద చిక్కుకుపోయింది.
మిగిలిన క్రూ సిబ్బంది గాయాలతో రక్తమోడుతున్నారు.కానీ అతను తన క్షేమం గురించి ఆలోచించలేదు.
కేవలం గాయపడిన సిబ్బందికి ఎలా సాయం చేయాలా అని చూశాడు.గేరింగ్ సిస్టమ్‌లో తన యూనిఫాం ఇరుక్కుపోయిందని, దానితో పాటు కాలు బయటకు తీస్తేనే టాంకర్ కదులుతుందని భావించి గేరింగ్ పాయింట్‌లో ఇరుక్కుపోయిన తన కాలిని స్వయంగా నరుక్కున్నాడు.

తీవ్రంగా రక్తస్రావం జరుగుతున్నా, స్పృహ కోల్పోతున్నా ఎలాగోలా బయటపడ్డాడు.ప్రమాదంలో ట్యాంక్ యొక్క రేడియోలు, ఇతర కమ్యూనికేషన్ సాధనాలు ధ్వంసం కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడానికి వీలు లేకుండా పోయింది.అయితే గన్నర్ వద్ద ఒక ఫోన్ ఉండటంతో దాని సాయంతో సహాయక బృందాలకు విషయాన్ని తెలియజేశాడు.వెంటనే అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీమ్ వారిని రక్షించి జర్మనీలోని ల్యాండ్‌స్టూహ్‌లోని ఆసుపత్రికి అక్కడి నుంచి టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు తరలించారు.
శస్త్రచికిత్స అనంతరం ఫోర్ట్ సామ్ హ్యూస్టన్‌లోని బ్రూక్ ఆర్మీ మెడికల్ సెంటర్‌లో చేర్చారు.ప్రమాదంలో కాలిని పొగొట్టుకున్న ఎజ్రా మేస్‌కి ప్రొస్టెటిక్ లెగ్‌ను అమర్చారు.