కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలకు చెక్ పడేది ఎప్పుడు ?

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకాపోయినా ఆ పార్టీ నాయకుల తీరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరైన ఆ పార్టీలో నాయకుల మధ్య ఎప్పుడూ ఏకాభిప్రాయం వచ్చినట్టు కనిపించదు.

దీనికి కారణం ఆ పార్టీ నాయకులకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్లే.ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ఎప్పుడూ ముందుంటారు.

అందుకే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ విషయాలను పెద్దగా పట్టించుకోనట్టే కనిపిస్తుంటుంది.దీంతో నేతలు ఎవరికి వారు తమ వాక్ స్వాతంత్య్రం ప్రదర్శిస్తూ ఉంటారు.

తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన దగ్గర నుంచి నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.ఏ విషయంలోనూ నేతలు ఒక్క తాటి పైకి రాలేకపోతున్నారు.

Advertisement

ఎవరి నిర్ణయాలు వారే తీసుకుంటూ.తమకి నచ్చినట్టు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

  హుజూర్ నగర్ అభ్యర్ధి ఎంపిక విషయంలోనూ నాయకుల మధ్య విబేధాలు మరింత ముదిరినట్టు కనిపించాయి.టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి భువనగిరి ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ జిల్లా విషయంలో పక్క జిల్లా నాయకుల సలహాలు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మాకు ఈ మధ్యే పార్టీలో చేరిన వారి సలహాలు అస్సలు అవసరం లేదంటూ మాట్లాడారు హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక అంశం గురించి మాట్లాడుతూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు.హుజూర్ నగర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.దీనిపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందిస్తూ పార్టీలో ఉన్నఇతర నాయకులను సంప్రదించకుండా తనకు నచ్చినవాళ్లని నిలబెట్టుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు.

హుజూర్‌ నగర్‌ అభ్యర్థిగా స్థానికులైన శ్యామల కిరణ్‌రెడ్డి పేరును తాను ప్రతిపాదిస్తున్నట్లుగా రేవంత్ చెప్పారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

  హుజూర్ నగర్ స్థానానికి ఉత్తమకుమార్ రెడ్డి భార్యను అభ్యర్థిగా ప్రకటించినందుకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ఛార్జ్ కుంతియాకు రేవంత్ ఫిర్యాదు కూడా చేశారు.దీనిపై కోమటిరెడ్డి స్పందిస్తూ హుజూర్‌నగర్‌లో ఎవరిని అభ్యర్థిగా పెట్టాలో మాకు తెలియదా, రేవంత్ రెడ్డి చెబుతున్న అభ్యర్థి పేరు నాకే కాదు, ఆ ప్రాంత నేత, మాజీ మంత్రి జానారెడ్డికి కూడా తెలియదన్నారు.ఇక ఈ వివాదం ఇలా నడుస్తుండగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యురేనియం తవ్వకాల మీద ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం కూడా కాంగ్రెస్ నాయకుల మధ్య మరింత అగ్గి రాజేసింది.

Advertisement

తెలంగాణాలో అస్సలు ప్రజాధారణ లేని జనసేన పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా హాజరయ్యారంటూ ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే సంపత్ మండిపడ్డారు.దీనిపై ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి.

తాజా వార్తలు