నల్లమల్ల అడవులతో పాటు పలు తెలుగు రాష్ట్రాల ప్రాంతాల్లో యూరేనియం ఖనిజ సంపద ఉందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.నల్లమల్ల అడవుల్లో ఉన్న భారీ యురేనియం ఖనిజ సంపదను తీసేందుకు రంగం సిద్దం అవ్వడంతో ప్రజా సంఘాలు, యువత అంతా కూడా యురేనియం మైనింగ్‌కు వ్యతిరేక ప్రచారం చేయడం జరిగింది.
ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా మాట్లాడటం జరిగింది.దాంతో కేంద్ర ప్రభుత్వం తగ్గినట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై కేంద్రం తన మాట మార్చినట్లుగా మంత్రి వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.
యురేనియం తవ్వకాల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అసలు మైనింగ్ ప్రారంభించే ఉద్దేశ్యం కూడా లేదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
గతంలో యురేనియం మైనింగ్‌కు కాంగ్రెస్ అనుమతి ఇచ్చింది.అలాగే తెలంగాణ ప్రభుత్వం యురేనియం నిక్షేపాలను గుర్తించడానికి అనుమతి ఇచ్చింది.కాని ఇప్పుడు రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.కేంద్రం యురేనియం ఖనిజ సంపదపై ఒక డేటాబేస్‌ను తయారు చేసే ఉద్దేశ్యంతోనే సర్వే చేయించడం జరిగిందని, మైనింగ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయమే తీసుకోలేదని తేల్చి చెప్పాడు.







