అమెరికాలో వింత దొంగ..ఇలా దొరికిపోయాడేంటి..!

అమెరికాలో ఓ దొంగ దొరికిపోయిన వైనం వింటే నవ్వు ఆపుకోలేరు.

దొంగతనానికి వెళ్ళిన ఓ దొంగ అన్నీ దోచేసుకున్న తరువాత పారిపోకుండా ఆ దొంగ చేసిన వింత పని ఇప్పుడు అందరిని కడుపుబ్బా నవుకునేలా చేస్తోంది.

ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు తో ఆ దొంగని పట్టుకున్నారు.కానీ దొంగ చేసిన ఆ పని ఎందుకు చేశాడో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు పోలీసులు.

వివరాలలోకి వెళ్తే.

  చికో స్టేట్ యూనివర్సిటీ కి చెందిన ఓ విద్యార్ధిని నార్త్ కాలిఫోర్నియా లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటోంది.ఓ రోజు ఓ దొంగ ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ లోని తన రూమ్ లోకి వచ్చి ఎంతో విలువైన వస్తువులు దొంగిలించాడు.ఈ క్రమంలోనే వెళ్తూ వెళ్తూ ఆమె గాఢ నిద్రలో ఉండగా నగ్నంగా ఆమె పక్కనే పడుకున్నాడు.

Advertisement

ఉదయం లేవగానే ఆమె అతడిని చూసి ఒక్కసారిగా పెద్ద పెద్ద అరుపులు వేస్తూ బయటకి వెళ్ళిపోయింది.

  ఈ క్రమంలోనే దొంగ కూడా పారిపోయాడు.ఆ తరువాత ఆమె జరిగిన ఉదంతం అంతా పోలీసులకి ఫిర్యాదు రూపంలో అందించింది.విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా సాయంతో అతడిని అతి కష్టంమీద పట్టుకున్నారు.

వస్తువులు అన్నీ దొంగిలించి నువ్వు దర్జాగా వెళ్లిపోవచ్చు కానీ ఎందుకు ఆమె పక్కన నగ్నంగా పడుకున్నావు అని ఎంత అడిగినా ఆ దొంగ నోరు విప్పడం లేదట.దాంతో అసలు దొంగ దొంగిలిచిన వస్తువులకంటే కూడా ఆమె పక్కన అలా ఎందుకు పడుకున్నాడో అనేది పెద్ద చర్చగా మారింది.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు