టీం ఇండియా బౌలర్ మహ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ గత ఏడాది మార్చిలో గృహ హింస కేసును పెట్టడం జరిగింది.తనను అదునపు కట్నం కోసం వేదించడంతో పాటు, అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని తనను వేదిస్తూ ఉన్నాడు అంటూ షమి భార్య జహాన్ ఫిర్యాదు చేసింది.
అప్పటి నుండి కూడా షమి పలు అవాంతరాలు, విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.మొన్నటి వరల్డ్ కప్‌లో అతడి ప్రదర్శణతో ఆ విమర్శలు అన్ని తొలగి పోయినట్లయ్యింది.
అయితే తాజాగా జహాన్ పెట్టిన కేసుకు సంబంధించి షమిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.దాంతో షమి అరెస్ట్ అవ్వక తప్పదని అంతా భావించారు.
షమి తనపై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌పై స్టే తెచ్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు.చివరకు కోర్టు నుండి స్టే తెచ్చుకున్నాడు.పశ్చిమబెంగాల్ కు చెందిన అలీపోర్ న్యాయస్థానం షమి పై జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ను రెండు నెలల వరకు నిలిపి వేస్తున్నట్లుగా తాజాగా తీర్పు ఇచ్చిందని షమి తరపు లాయర్ పేర్కొన్నాడు.ఈ కేసును తిరిగి నవంబర్ 2న విచారణ జరుపనున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు.
షమి ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అయినందున ఆయన విచారణకు హాజరు కాలేడు అంటూ న్యాయస్థానం ముందు షమి తరపు లాయర్ పిటీషన్ వేయగ అందుకు కోర్టు ఓకే చెప్పడం కూడా జరిగింది.ఈ రెండు విషయాల్లో షమికి కాస్త ఊరట అయితే దక్కింది అనుకోవాలి.







