రాంజెఠ్మలానీ వాదించిన కేసులు తెలిస్తే చనిపోయిన ఆయనపై కోపం రావడం ఖాయం, అంతా డబ్బు కోసమే

దేశంలోనే కాదు ప్రపంచంలోనే అందరు లాయర్‌లకు రాంజెఠ్మలానీ ఇన్సిపిరేషన్‌ అయ్యి ఉండవచ్చు.ఎందుకంటే ఆయన టేకాఫ్‌ చేసిన కేసులు, సాధించి విజయాలు మామూలువి కాదు.

 Stunningfacts About Farmerminister And A Greatlawyer Ram Jatmalani Ram-TeluguStop.com

దేశంలోనే దిగ్గజ లాయర్‌గా గుర్తింపు దక్కించుకోవడంతో పాటు తీవ్ర స్థాయిలో విమర్శళు కూడా ఈయన సొంతం చేసుకున్నారు.ఈయన టేకాఫ్‌ చేసిన కేసుల వల్ల ఈయన మీద ఏకంగా దేశ ద్రోహం వంటి ముద్ర కూడా పండింది.

అలాంటి ముద్రలు తనపై పడితే తానే ఒక లాయర్‌ కనుక ఈజీగానే తూడ్చివేసుకుంటూ వచ్చేవారు.తనను ఎన్ని విధాలుగా విమర్శించినా కూడా కోర్టులో అవతలి లాయర్‌ను ఎలా అయితే తీసి అవతల పడేసి తన కేసును గెలిచేవాడో అలాగే పట్టించుకోకుండా ఉండేవాడు.

Telugu Ram Jatmalani, Job Age-

  90 ఏళ్ల వయసులో కూడా రాంజెఠ్మలానీ కోర్టు మెట్లు ఎక్కి తన వద్దకు వచ్చిన వారికోసం వాదించిన దాఖలాలు ఉన్నాయి.అద్బుతమైన వాక్చాతుర్యంతో పాటు లా లోని లొసుగులు మరియు ఏ రూటున వెళ్తే పని అవుతుందనే విషయాన్ని జెఠ్మలానీ బాగా ఎక్కించుకున్నారు.అందుకే ఆయన టేకాఫ్‌ చేసిన ప్రతీ కేసు కూడా విజయమే అయ్యేది.ఆయన ఒక గొప్ప న్యాయ శాస్త్ర మేదావి అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాని ఆయన ఎవరి తరపున వాధించాడో తెలిస్తే మాత్రం ఆయన అంటే కోపం రాకుండా ఉండదు.దేశంలోని అత్యధిక హై ప్రొఫైల్‌ కేసులను వాదించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆర్ధిక నేరాలకు సంబంధించిన కేసు నుండి రాజీవ్‌ గాంధీ, ఇందిరాగాంధీ, అప్జల్‌ గురులకు మద్దతుగా వాదించడం వరకు ఆయన ఎన్నో ఛారిత్రాత్మక కేసులను నెత్తిన వేసుకున్నాడు.

జెఠ్మలానీ ఇందిరా గాంధీ మరియు రాజీవ్‌గాంధీలను హత్య చేసిన వారికి మద్దతుగా వాదించడంతో అప్పట్లోనే దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.

స్టాక్‌ మార్కెట్‌ స్కాంతో దేశ ఆర్ధిక వ్యవస్థను అతలా కుతలం చేసిన కేతన్‌ పరేఖ్‌ కోసం ఈయన వాదించాడు.ఇండియాపై ఉగ్రదాడి చేశాడనే ఆరోపణలు ఉన్న అప్జల్‌ గురూకు కూడా ఈయన వాదించడం అప్పట్లో సంచలనం అయ్యింది.

ఆ తర్వాత కొన్నాళ్లకు అప్జల్‌ గురు కేసును వదిలేశాడు.ఎన్నో హత్యల కేసుల్లో ఇన్వాల్వ్‌ అయ్యి ఉన్న రాజకీయ ప్రముఖుల మరియు సెలబ్రెటీలకు సంబంధించిన కేసులను ఈయన వాదించాడు.

Telugu Ram Jatmalani, Job Age-

  దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించి, దేశం పరువు పోయేలా చేసిన పశువుల దాన కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మద్దతుగా ఈయన వాదించాడు.లాలూ ఆ కేసులో ముద్దాయిగా తేలి శిక్ష కూడా అనుభవిస్తున్నారు.అలాంటి వ్యక్తికి ఈ కేసు విషయంలో బెయిల్‌తో పాటు ఆ కేసు నుండి బయట పడేందుకు ప్రయత్నించారు.జగన్‌ అక్రమాస్తుల కేసు, 2జీ స్పెక్ట్రమ్‌, నేవీ వార్‌ రూం లీక్‌ కేసులో ఇలా ఎన్నో కేసుల్లో ప్రభుత్వంకు వ్యతిరేకంగా వాదించాడు.

ఈయన వాదించని కేసుల్లో ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి.ఒక్కసారి ఎవరైనా దోషి లేదా నేరగాడి తరపున జెఠ్మలానీ వాదించేందుకు కోర్టు వేసుకున్నాడు అంటే ఆయన కోటి తీసుకోవాల్సిందే.

కేసు తీవ్రతను బట్టి ఆయన రెమ్యూనరేషన్‌ ఉంటుంది.ఇంకా ఈయనకు ఉన్న అత్యంత అరుదైన రికార్డు ఏంటీ అంటే వాజ్‌పేయి క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేసి, మళ్లీ ఆయనపైనే ఎంపీగా పోటీకి చేయడం జరిగింది.

డబ్బు కోసం ఎంతటి కేసునైనా టేకాఫ్‌ చేస్తాడంటూ విమర్శలు ఉన్నాయి.ఆయన చనిపోయాడనే బాధ ఉన్నా కూడా ఆయన వాదించిన కేసుల వివరాలు ఆయనపై ఇప్పుడు కోపంను తెచ్చి పెడుతున్నాడు.

ఆయన ఎలాంటి వారు అయినా చనిపోయారు కనుక గౌరవించడం మన కనీస ధర్మం.అందుకే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube