బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమా అంచనాలను ఆదుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యింది.ప్రభాస్ ఏమాత్రం ఈ సినిమాతో ఆకట్టుకోలేక పోయాడు.
సినిమా 350 కోట్లతో తెరకెక్కితే కనీసం సినిమా సగం వసూళ్లను కూడా రాబట్టే పరిస్థి కనిపించడం లేదు.ఇలాంటి సమయంలో కాస్తో కూస్తో వసూళ్లను రాబట్టేందుకు ప్రమోషన్స్ ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది.
సాహో విషయంలో అలా జరగడం లేదు.అసలు విషయం తెలిసిపోయింది మేకర్స్ ప్రమోషన్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టదల్చుకోవడం లేదని సమాచారం అందుతోంది.అలాగే చిత్ర యూనిట్ సభ్యలు కూడా నామ్ కె వాస్త్ అన్నట్లుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.సినిమా విషయంలో వారు తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నారు.వారి బాధ వర్ణనాతీతం.ఇలాంటి సమయంలో కనీసం వారు ప్రమోషన్ లో కూడా పాల్గొనలేక పోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సాహో సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ కనిపించక పోవడంపై చర్చ జరుగుతోంది.గత కొంత కాలంగా యమా బిజీగా ప్రమోట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు మాత్రం తగ్గదు.
మొదటి నాలుగు రోజుల తర్వాత ప్రభాస్ మళ్ళీ బయ్యర్ల కోసం ప్రమోషన్స్ కు రాబోతున్నాడని సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ రూపొందిన సాహో సినిమా 150 కోట్ల వరకు షేర్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది.