మహానటి సినిమాతో కీర్తి సురేష్ ఎంతగా గుర్తింపు తెచ్చుకుందో మరోసారి ఋజువయ్యింది.జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న కీర్తికి ఇప్పుడు స్టార్ సెలబ్రెటీలందరు అభినందిస్తున్నారు.
ఈ రేంజ్ లో గౌరవం దక్కితే ఏ నటికైనా సరే వెంట వెంటనే ఆఫర్స్ వస్తుంటాయి.ఇప్పుడు కీర్తి సురేష్ కి కూడా గ్యాప్ లేకుండా ఆఫర్స్ వస్తున్నాయట.

మహానటి సినిమా ముందు వరకు ఆమె క్రేజ్ సౌత్ లొనే ఉండేది.ఆ సినిమా తరువాత బాలీవుడ్ ని కూడా ఈ బ్యూటీ ఆకర్షించింది.కానీ అవకాశాలు పెద్దగా రాలేవు.బాలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకునేందుకు అమ్మడు సన్నబడింది కూడా.అయితే రీసెంట్ గా ప్రకటించిన నేషనల్ అవార్డ్స్ లో కీర్తికి ఉత్తమ తెలుగు నటిగా అవార్డ్ దక్కడంతో సీన్ మారినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ స్టోరీ డిస్కర్షన్స్ కోసం అమ్మడిని కలవడానికి అపాయిట్మెంట్ కూడా తీసుకున్నట్లు సమాచారం.అయితే కీర్తి మాత్రం ఆలోచించి సబ్జెక్టులను ఎంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది.
గడిచిన ఆరు నెలలో ఆమె 4 మీడియం బడ్జెట్ సినిమాలను వధులుకున్నట్లు టాక్.కథ నచ్చాలి అలాగే నా పాత్ర కథలో కలిసేలా ఉండాలి.
అలా అయితేనే సినిమా చేయడానికి ఒప్పుకుంటానని కీర్తి చెబుతోంది.మరి నేషనల్ అవార్డ్ అమ్మడి జీవితాన్ని ఇంకా ఎక్కడివరకు తీసుకెళుతోందో చూడాలి.







