వీరమాచినేని ఈ మధ్య కాలంలో ఆరోగ్య నియమాలు చెప్పడంలో, స్థూలకాయాన్ని తగ్గించడంలో అందుకు తగ్గ సలహాలు చెప్పడంలో బాగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి.వీరమాచినేని సలహాలు పాటించిన ఎంతో మంది స్థూలకాయులు బరువు తగ్గినా సంఘటనలు అనేకం ఉన్నాయి.
ఈ క్రమంలోనే తానా వీరమాచినేని తో అమెరికాలో ఆహార ఆరోగ్య అవగాహనా సదస్సు ఏర్పాటు చేసింది.

హౌస్టన్ లో తాన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకి భారీ సంఖ్యలు ప్రవాసాంధ్రులు తరలి వచ్చారు.
విఆర్కె డైట్ ద్వారా ఆహార నియమాలలో తను తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు, ఆచరణ ఫలితాలు గురించి సుమారు సుదీర్ఘ ప్రసంగం చేశారు.పలువురు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్పారు.
ఈ సదస్సు కి ముందుగా వీరమాచినేనికి సత్కరించి గౌరవించుకున్నారు తన సభ్యులు.వీరమాచినేని ఆరోగ్య సూత్రాలు పాటించేవిధంగా ఉంటాయని.ముఖ్యంగా స్థూలకాయంతో బాధలు పడే వారికి వీరమాచినేని డైట్ ఎంతగానో ఉపయోగ పడుతుందని పలువురు తెలిపారు.ఈ సదస్సుకి విచ్చేసిన వీరమాచినేని గారికి సదస్సు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.







