టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ పార్టీలో చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్నాడు.పార్టీ మీద ఏ విమర్శలు వచ్చినా అందరికంటే ముందుగానే లోకేష్ వాటిని తిప్పికొడుతున్నాడు.
రాష్ట్రంలో ఏ కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నా వెంటనే స్పందిస్తున్నాడు.ఇక సోషల్ మీడియా లో అయితే ఆయన స్పీడ్ కి బ్రేకులే లేకుండా పోయాయి.
అయితే ఒక్కసారిగా లోకేష్ ఇంత యాక్టివ్ అవ్వడానికి కారణం ఏంటో మాత్రం ఎవరికీ అర్ధం కావడంలేదు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ ప్రజల్లో బాగా పట్టు పెంచుకునేందుకు బాగా కష్టపడుతున్నట్టయితే అందరికి అర్ధం అవుతోంది.
ఒకవైపు అధికార పార్టీ వైసీపీ ప్రజల్లోకి వివిధ పథకాలతో ముందుకు దూసుకువెళుతూ టీడీపీని ప్రజలు మర్చిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అదే సమయంలో టీడీపీ నాయకులను అన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని లోకేష్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.మళ్ళీ ఎన్నికలు రావడానికి ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉంది.అప్పటికి చంద్రబాబు వయస్సు రీత్యా చూసినా రిటైర్మెంట్ తప్పక తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది.అందుకే అతను ముందుగానే పార్టీ బాధ్యతలు తప్పకుండా వేరే వారికి అప్పగించాల్సిందే.అయితే లోకేష్ ను కాదని వేరే వారికి అప్పగించేందుకు చంద్రబాబు ఇష్టపడడు.
కాబట్టి లోకేష్ కే ఆ బాధ్యతలు అప్పగిస్తాడు.కానీ ఇప్పటికిప్పుడు ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించకుండా కొన్ని షరతులు విధించాడట.
నువ్వు ఏమైనా చెయ్యి, ఎలా అయినా చెయ్యి నేను కల్పించుకోను కాకపోతే ప్రజల్లో మాత్రం మంచి ఇమేజ్ సొంతం చేసుకోవాలి అంటూ హితబోధ చేసాడట.వీలైనంత ఎక్కువగా ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చంద్రబాబు తరువాత లోకేష్ అనేలా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటూ సూచించాడట.
దీంతో ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎక్కువగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న లోకేష్ అక్కడి ప్రజల సమస్యలపైనా స్పందిస్తున్నారు.ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా నారా లోకేష్ ట్వీట్లు చేస్తున్నారు.తన ప్రసంగాలను కూడా సరికొత్త రీతిలో ఉండేలా చూసుకుంటున్నాడు.
వీలనంత తొందర్లో సైకిల్ యాత్ర కూడా చేపట్టి ప్రజల్లో తన ఇమేజ్ అమాంతం పెంచుకోవాలనేది లోకేష్ ఆలోచన.







