తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో పార్టిసిపెంట్స్ విషయంలో ప్రేక్షకులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు.గతంలో ఎప్పుడు లేని విధంగా స్టార్ కపుల్స్ ఉండటంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అందరికి తెలిసిన వారే.
దాంతో పాటు ఇంట్లో ఉన్న అమ్మాయిలు తమ అందాలతో తెగ అలరిస్తూ ఉన్నారు.ఇక అబ్బాయిలు ఎంటర్‌టైన్ చేస్తూ హడావుడి చేస్తున్నాడు.
ఇలాంటి సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.

తమన్నా సింహాద్రీ గురించి ప్రేక్షకులు మొదటి నుండి ఆసక్తిగా లేరు.ఆమె ఎంట్రీ ఇవ్వగానే ఇంట్లో వారు చాలా ఫ్రెండ్లీగా ఆమెను రిసీవ్ చేసుకున్నారు.కాని ఆమె ప్రవర్తన మాత్రం మరీ దారుణంగా ఉంది.
మహేష్, వరుణ్ సందేశ్‌ల గొడవ ఎప్పుడో సర్దుమనిగింది.అయినా కూడా ఆమె మళ్లీ మహేష్ వద్దకు వెళ్లి సానుభూతి చూపిస్తూ గ్రూప్స్ కట్టే ప్రయత్నం చేసింది.
ఇక అలీ మరియు రవికృష్ణలతో క్లోజ్‌గా ఉండేందుకు ప్రయత్నించింది.రవికృష్ణ మొదట ఆమెకు క్లోజ్‌గా ఉన్నా ఆ తర్వాత ఆమె ప్రవర్తనతో దూరం అయ్యాడు.
నిన్నటి ఎపిసోడ్‌లో రవికృష్ణ మరియు తమన్నాల మద్య వివాదం ఏర్పడింది.అతడి ప్రవర్తనను తమన్నా తప్పుబట్టింది.నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను, నా గురించి మీకు ఎందుకు అంటూ తమన్నాపై రవికృష్ణ మండి పడ్డాడు.దాంతో తమన్నా బాధ పడింది.
ఇక పదే పదే బాబా భాస్కర్ కాళ్లకు దండం పెట్టడంతో పాటు, అలీ సిక్స్ ప్యాక్ చూపించి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ కామెడీ చేసే ప్రయత్నం చేసింది.అది కాస్త విగటించింది.
దాంతో ఇంటి సభ్యులను మరియు ప్రేక్షకులను కూడా తమన్నా చిరాకు పెట్టి విసిగిస్తుంది.అందుకే ఎప్పుడెప్పుడు తమన్నా ఎలిమినేషన్స్ వస్తుందా ఆమెను పంపిద్దామా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







