అమెరికాలో తెలంగాణా వాసుల వనభోజనాలు...!!!

అమెరికా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పోర్ట్ ల్యాండ్ లో వనభోజనాలు నిర్వహించారు.ఫోర్ట్ ల్యాండ్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీని ముందుగా తెలంగాణా ప్రొఫెసర్ జయశంకర్ కి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

 Telangana Development Forum Conducted Vanabhojanalu At America-TeluguStop.com

ఈ వన భోజనాలకి పోర్ట్ ల్యాండ్ మెట్రో నగరాల నుంచీ అధిక సంఖ్యలో తెలుగు వారు తరలి వచ్చారు.ఈ సంస్థ సభ్యులే అక్కడ స్వయంగా తెలంగాణా వంటలని తయారు చేసుకుని అందరికి వడ్డించారు.

అమెరికాలో తెలంగాణా వాసుల వనభ

అలాగే ఈ భోజనాలకి ముందు అందరూ సరదాగా పిల్లలు పెద్దలు కలిసి వాలీబాల్, చెస్,క్యారమ్స్ , బ్యాడ్మింటన్ వంటి స్పోర్ట్స్ ఆడుకున్నారు.అదేవిధంగా మహిళలు, వంటలతో ఘుమ ఘుమలతో అదరగొడుతుంటే ఆట పాటలతో పిల్లలు కార్యక్రమానికి మరింత ఉశ్చాహాన్ని తెచ్చి పెట్టారు.

ఈ వనభోజనాలని విజయవంతం చేసినందుకు గాను సంస్థ సభ్యులు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థ అధ్యక్షుడు శ్రీని జ్ఞాపికలు అందించారు.

అలాగే స్పోర్ట్స్ లో ఫన్ గేమ్స్ లో సరదాగా పాల్గొని విజేతలుగా నిలిచినా వారికి కూడా బహుమతులు అందించారు.సంస్థ వాలంటీర్లకి , సభ్యులకి ప్రతీ ఒక్కరికి శ్రీని కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని, అందుకు అందరి మద్దతు కావాలని శ్రీని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube