బాలీవుడ్ లో ధోని సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్ హీరోయిన్ కియరా అద్వానీ.ఈ భామ తెలుగులో మొదటి సినిమానే మహేశ్ బాబుతో చేసే అవకాశం సొంతం చేసుకోవడంతో పాటు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక రెండో సినిమాగా రామ్ చరణ్ తో వినయ విదేయ రామా సినిమా చేసిన అది కాస్తా డిజాస్టర్ కావడంతో పాటు ఏ మాత్రం ప్రాదాన్యత లేని పాత్ర కారణంతో ఆమె ఇమేజ్ కూడా దెబ్బతింది.ఇక తెలుగులో అవకాశాలు వచ్చిన పెద్దగా ఆసక్తి చూపించకుండా ఈ భామ ఎక్కువగా బాలీవుడ్ సినిమాల మీద దృష్టి పెట్టింది.
తాజాగా అర్జున్ రెడ్డి రీమేక్ గా సాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఈ భామ మరో సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఇక ఈ సినిమాలో సాహిద్ కపూర్ తో ఘాటైన సన్నివేశాలలో కూడా రెచ్చిపోయి నటించిన ఈ భామకి కబీర్ సింగ్ సూపర్ సక్సెస్ ఇవ్వడంతో బాలీవుడ్ లో ఊహించని స్థాయిలో హైప్ వచ్చింది.
మొన్నటి వరకు చిన్న హీరోయిన్ గా ఉన్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోల ఛాయస్ గా మారింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ఒకరి మీద ఒకరు చేయి చేసుకునే సన్నివేశాలు రిలీజ్ కి ముందు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
సమంత నుంచి తాప్సి వరకు అందరూ ఈ సన్నివేశాల మీద, అలాగే వీటిని సమర్ధిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అన్న మాటల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు.అయితే ఇప్పుడు ఇందులో హీరోయిన్ కియరా ఈ వివాదంపై స్పందించింది.
సినిమాలో వారు అలా కొట్టుకోవడం, నోటికొచ్చినట్లు తిట్టుకోవడం నాక్కూడా నచ్చలేదు.అయితే సినిమా వేరు, నిజ జీవితం వేరు.
నా జీవితంలో మాత్రం అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకుంటా నాపై నా భర్త చెయ్యిని పడనివ్వను’ అని తెలిపింది.







