మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వైష్ణవ్ తేజ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది.ఈ చిత్రంలో తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.వైష్ణవ్ తేజ్ కూడా విజయ్ సేతుపతితో నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.‘ఉప్పెన’ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంకు ఖచ్చితంగా విజయ్ సేతుపతి హైలైట్‌గా నిలుస్తాడని అంతా అనుకున్నారు.కాని తాజాగా ఉప్పెన నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

కొన్ని కారణాల వల్ల ఉప్పెన చిత్రం షూటింగ్ ఆలస్యం అయ్యింది.అనుకున్న సమయంకు విజయ్ సేతుపతితో షూటింగ్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడు.ఆ కారణంగా విజయ్ సేతుపతి ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
వైష్ణవ్ తేజ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ సరిగా లేకపోవడంతో షూటింగ్ ఆరంభించిన తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు చేసినట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి.ఆ కారణంగానే విజయ్ సేతుపతి తప్పుకుని ఉంటాడనే వాదన కూడా వినిపస్తుంది.

ఈమద్య కాలంలో తమిళనాట విజయ్ సేతుపతి స్టార్ హీరోగా మారిపోయాడు.ఈయన చేసిన ప్రతి సినిమా కూడా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు కమర్షియల్‌గా మంచి సక్సెస్‌ను దక్కించుకుంటుంది.అందుకే తెలుగులో కూడా ఈయన ఎంట్రీ ఇస్తున్నాడు.సైరా చిత్రంలో ఈయన కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.ఈ సమయంలోనే మెగా మూవీ ‘ఉప్పెన’లో కనిపించబోతున్నట్లుగా భావిస్తే వివిధ కారణాల వల్ల తప్పుకోవడం జరిగింది.మళ్లీ ఏ తెలుగు సినిమాతో విజయ్ రాబోతున్నాడో చూడాలి.







