జగన్ డౌట్: సిఫార్సుల వెనుకున్న తిరకాసు ఏంటి ?

ఏపీ లో తన పరిపాలన ఒక సువర్ణ అధ్యయనంగా తరతరాలు చెప్పుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నాడు.అందుకే ప్రతి పనిలోనూ పారదర్శకత ఉండేలా చూసుకుంటున్నాడు.

ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా నీతి నిజాయితీగా క్షేత్ర స్థాయిలో పరిపాలన ఉండేలా చూసుకుంటున్నాడు.ఇదే విషయమై తమ పార్టీ ఎమ్యెల్యేలు, మంత్రులకు అనేకసార్లు చెప్పాడు.

అయితే జగన్ ఒకటి భావిస్తే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో మరొకటి జరగడం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది.అయితే ఆ విషయం ఎక్కడా బయటపడకుండా జగన్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల బదిలీలు జరుగాయి.ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు జరిగిన తర్వాత పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలో ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తి కావొస్తోంది.

Advertisement

అయితే ఈ బదిలీల వ్యవహారంలో అంతా పారదర్శకంగానే జరిగిందని, ఎక్కడా సిపార్సులకు తావులేదని కలెక్టర్లు, ఎస్పీలు ఇప్పటికే అనేక స్టేట్మెంట్స్ ఇచ్చారు.కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి అంతా రివర్స్ లో జరిగినట్టు బహిరంగంగానే అంతా చర్చించుకుంటున్నారు.బదిలీలకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా సిఫార్సు లేఖలను ఎక్కడా వ్యతిరేకించలేదు.

దీంతో చాలామంది చివరి నిమిషంలో కూడా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పనులు పూర్తి చేయించుకున్నారు.ఇలా ఒక్కో ఎమ్మెల్యే వందలాది లెటర్స్ ను ఆయా జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి, వివిధ శాఖల ఉన్నతాధికారులకు ఇచ్చారు.

అయితే పాలనా పరమైన విషయాల్లో మీరు ఎక్కడా జోక్యం చేసుకోవద్దని, సిపార్సులు చేయవద్దని అధినేత జగన్ అంతకు ముందే హెచ్చరించినా వీరు వినలేదు.జగన్ మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

తాను వద్దని ఎంత చెబుతున్న సిపార్సులు చేయడం ఏంటని, అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎంతమందికి సిఫార్సు లేఖలు ఇచ్చారు ? ఎవరు ఎవరిని అధికారుల వద్దకు పంపించారు అనే విషయాలపై ఇప్పటికే పూర్తి సమాచారం జగన్ దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది.అంతే కాదు ఈ విషయమై కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాల నుంచి రికమండేషన్ లెటర్ల జిరాక్స్ కాపీలను జగన్ తెప్పించుకున్నాడట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్యెల్యేలందరికి ఒక మీటింగ్ పెట్టి ఈ విషయంలో గట్టిగా క్లాస్ పీకలనే ఆలోచనలో జగన్ ఉన్నాడట.

Advertisement

తాజా వార్తలు