ఏపీ,ఛత్తీస్ గఢ్ లతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

ఏపీ, ఛత్తీస్ గఢ్ లతో మరో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించినట్లు తెలుస్తుంది.

ఏపీ గవర్నర్ గా విశ్వభూషణ్ హరిచందన్ ని నియమించగా ఇప్పుడు తాజగా ఉత్తరప్రదేశ్,పశ్చిమ బెంగాల్లో,త్రిపుర,మధ్యప్రదేశ్,బీహార్,నాగాలాండ్ లకుకొత్త గవర్నర్ లను నియమించినట్లు తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా ఆనంది బెన్ పటేల్ ని నియమించగా,పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా జగదేవ్ దంకర్ నియామకం, త్రిపుర గవర్నర్ గా రమేష్ బయాస్,మాధప్రదేశ్ గవర్నర్ గా లాల్ జీ తాండవ్, బీహార్ గవర్నర్ గా ఫాగు చౌహన్, నాగాలాండ్ గవర్నర్ గా ఆర్ ఎన్ రవి లను నియమించినట్లు తెలుస్తుంది.మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందీ బెన్ ను ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు.

అలానే బీహార్ గవర్నర్ గా ఉన్న లాల్ జీ ని మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు.

గత కొద్దీ రోజులుగా రాష్ట్రాల్లో నూతన గవర్నర్ల నియామకం జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా కేంద్రం నుంచి ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.దీనితో మొత్తం 8 రాష్ట్రాలకు గాను నూతన గవర్నర్ లను నియమించినట్లు సమాచారం.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు