ఇండియాలో కొన్నాళ్ల క్రితం పోలీసు శాఖ ద్వారా తెలిసిన విషయం ఏంటీ అంటే ప్రస్తుతం జరుగుతున్న నేరాలకు, హత్యలకు ఎక్కువగా అక్రమ సంబంధాలే కారణం.ఔను ఈ విషయం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా ఇది పచ్చి నిజం.
ఎంతో మంది అక్రమ సంబంధాల మోజులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.అత్యంత దారుణాలకు పాల్పడటంతో పాటు, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
అక్రమ సంబంధం కారణంగా ఒక మహిళ తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు అయిదు సంవత్సరాల పాటు తన అత్తకు నరకం చూపించింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… యూపీకి చెందిన ఒక యువతికి అప్పటికి పెళ్లి అయ్యి రెండు సంవత్సరాలు అయ్యింది.తన అత్తగారితో ఒక రోజు బజారుకు వెళ్లింది.అక్కడికి ఆమె తన ప్రియుడిని రప్పించుకుంది.
అత్తగారికి కనిపించకుండా పోయి ప్రియుడితో సరసాల్లో మునిగి పోయింది.చాటు మాటుగా సాగిస్తున్న సరసం అత్తగారి కంట పడింది.
దాంతో అత్త కోపంతో రగిలి పోయింది.ఈ విషయాన్ని కొడుకు చెబుతానంటూ హెచ్చరించింది.
మొదట బతిమిలాడిన ఆ కోడలు అత్తను బెదిరించింది.ఈ విషయాన్ని చెబితే నీ కొడుకును చంపేస్తానంటూ హెచ్చరించింది.
అయినా ఆమె వినిపించుకోలేదు.

తన ప్రియుడితో భర్తకు స్వల్ప గాయాలు అయ్యేలా కొట్టించింది.గాయాలు అయ్యేలా కొట్టించిన తనకు చచ్చేలా కొట్టించడం కష్టం కాదు.నువ్వు ఈ విషయాన్ని బయటకు చెబితే నా భర్త అని కూడా చూడకుండా చంపించి నేను నా ప్రియుడితో వెళ్లి పోతానంటూ హెచ్చరించింది.
దాంతో ఆ అత్త ఏం చేయాలో పాలుపోక అయిదు సంవత్సరాల పాటు ఈ విషయాన్ని కడుపులోనే దాచుకుంది.ఎలాగూ విషయం అత్తకు తెలిసింది కదా అని ఆమె ముందు ప్రియుడిని బాహాటంగానే కలిసింది.
తాజాగా ఏదైతే అదే అయ్యిందని విషయం పోలీసులకు వివరించింది.దాంతో కోడలు మరియు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.







