సౌత్ ఇండియా దర్శక దిగ్గజం శంకర్ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన, ఏవో కారణాల వలన ఆ సినిమా అర్ధంతరంగా ఆగిపోయింది.దీంతో ఇప్పుడు మరో స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేయాలని అనుకున్న ఇప్పట్లో శంకర్ తో సినిమా చేసేంత ఫ్రీగా ఎవరు లేరు.
దీంతో శంకర్ ద్రుష్టి ఇప్పుడు ఇద్దరు వారసుల మీద పడినట్లు తెలుస్తుంది.కోలీవుడ్ లో స్టార్ హీరోలైన చియాన్ విక్రమ్ తనయుడు ద్రువ్ హీరోగా ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ తెరకెక్కుతుంది.
ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది.ఇదిలా ఉంటే మరో వైపు స్టార్ హీరో విజయ్ తనయుడు కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు.
దానికి సంబంధించి శిక్షణ తీసుకుంటున్నాడు.
ఈ నేపధ్యంలో శంకర్ ఇప్పుడు ఈ ఇద్దరు వారసులతో భారీ మల్టీ స్టారర్ సినిమాని ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి స్టొరీ లైన్ విజయ్, విక్రమ్ కి చెప్పడం జరిగిందని, వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమాకి సంబదించి ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో దర్శక దిగ్గజం ఉన్నాడని సమాచారం.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరులో ఈ సినిమాని శంకర్ సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ నడుస్తున్నట్లు తెలుస్తుంది.







