వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ ప్రభుత్వం పై మరోసారి సంచలన ఆరోపణలు చేసారు.సోషల్ మీడియా వేదికగా గత కొద్దీ రోజులుగా ఆ పార్టీ పై,పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న విజయసాయిరెడ్డి మరోసారి ఆపార్టీ పై ఆరోపణలు చేశారు.
దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని స్వాహా చేసారు అంటూ తాజగా ఆరోపణలు చేశారు.ప్రజావేదిక నిర్మాణం కోసం కోటి రూపాయలు అయితే సరిపోతుంది అలాంటి దానికి 8 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దోపిడీ చేసారు అంటూ ఆరోపించిన ఆయన దోమల పేరుతో కోటిన్నర టీడీపీ ప్రభుత్వం స్వాహా చేసింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.విజయవాడలో దోమల గుంపుల రియల్ టైమ్ డ్యాటా, అవి ఆడో మగో తెలుసుకోవడానికి రూ.1.5 కోట్లు నాకేశారు.ప్రపంచంలో ఎక్కడా దోమల డేటా సేకరించే మూర్ఖపు ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు.దోమల పేరు చెప్పి కోటిన్నర ప్రజాధనాన్ని గుటకాయస్వాహ చేయడం మొదటిసారి వింటున్నాం.” అంటూ ట్వీట్ చేసి మరోసారి చర్చకు తెరలేపారు.

ఇప్పటికే ఒకరిపై నొకరు సెటైర్ లు వేసుకుంటూ నిత్యం కాలక్షేపం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.మీరు ఇంత అవినీతికి పాల్పడ్డారు అంటే మీ నాన్నగారి హయాంలో ఇంత అవినీతి అయిన సంగతి మరిచారా అంటూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో మాజీ మంత్రి నారా లోకేష్ కౌంటర్ పై కూడా సాయి రెడ్డి సెటైర్లు వేశారు.మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుంది.
స్థాయికి మరచి చెలరేగుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.అంతేకాకుండా మాజీ మంత్రి దేవినేని ఉమా పై కూడా వ్యాఖ్యలు చేశారు.







