కాళ్లు లేని తాబేలుకి లూసియానా స్టేట్ యూనివర్సిటీ వెటెరినరీ టీచింగ్ హాస్పటల్ అద్భుతం చేసింది.నడవలేని తాబేలు కి చక్రాలు అమర్చి ఆ తాబేలు సునాయాసంగా నడవడానికి వీలు కల్పించారు.
సాధారణంగా ఇది వరకు కళ్ళు లేని కుక్కలకు ఇలాంటి ప్రయోగాలు చేసి చక్రాలు అమర్చేవాళ్ళు.అయితే చిన్న జీవి అయిన తాబేలు కు కూడా కాళ్ళు లేకపోవడం తో ఏమి చెయ్యాలా అని అలోచించి టాయ్ స్టోర్ కి వెళ్లారు.
సరిగ్గా వారికీ అక్కడే ఆ తాబేలుకు ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది.లెగో కార్ కిట్ ని కొన్న డాక్టర్లు వాటి ద్వారా తాబేలు వెనుక భాగంలో రెండు చక్రాలు ఉండేలా అమర్చారు.
దీనితో నడవలేని తాబేలు ఇప్పుడు సునాయాసంగా నడవడమే కాకుండా ఈ సైజులో ఉన్న తాబేళ్ల కంటే కుండా ఎక్కువ వేగంగా నడుస్తుందట.మొదటి సారి ఒక కుటుంబం పెడ్రో అనే ఈ తాబేలును దత్తత తీసుకుంది.
అయితే దత్తత తీసుకున్న నాటికి పెడ్రో కి ఒక్క కాలు మాత్రమే లేదు.అయితే ఆ తరువాత కొన్ని నెలలు ఏటో వెళ్ళిపోయినా ఈ తాబేలు తన రెండో కాలు కూడా పోగొట్టుకుంది.
అయితే పెడ్రో పడుతున్న బాధను చూడలేకపోయిన ఆ కుటుంబం,చివరికి లూసియానా స్టేట్ యూనివర్సిటీ వెటెనరీ టీచింగ్ హాస్పిటల్ ను సంప్రదించగా, అక్కడి డాక్టర్లు తాబేలు పడుతున్న బాధకు పరిష్కారం కనుగొన్నారు.ఈ చక్రాలు తాబేలు వెనుక భాగంలో అమర్చడం వల్ల పెడ్రో వెనుక భాగంగా భూమికి తగులుకోకుండా డాక్టర్లు కాపాడగలిగారు.
అయితే డాక్టర్లు చేసిన ఈ అద్భుతగానికి ఆ కుటుంబం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంది.







